చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఇంజనీరింగ్ విద్యార్ధినిపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన.. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే... కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన ఓ విద్యార్ధిని మదనపల్లె సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో సెకండియర్ చదువుతోంది.

గత నెల 3న రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈమె స్నేహితుడితో మాట్లాడేందుకు హంద్రీనీవా కాలువ వద్దకు వెళ్లింది. ఈ సమయంలో అదే ఊరికి చెందిన ఎస్. అస్రఫ్, జయచంద్ర, షామీర్ మద్యం సేవించి చీకట్లో ఎవరో జంట ఉన్నారని తొలుత అస్రఫ్ వారి వద్దకు వెళ్లాడు.

తమ గ్రామానికి చెందిన విద్యార్ధిని కావడంతో పక్కనేవున్న ఆమె స్నేహితుడిని బెదిరించి ఆ విద్యార్ధినిని హంద్రీనీవా కాలువ వద్దకు లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం జయచంద్ర, షామీర్ కూడా లైంగిక దాడికి పాల్పడ్డారు.

అక్కడితో ఆగకుండా అత్యాచార దృశ్యాలను వీడియో తీసి.. ఎవరికైనా చెబితే హతమారుస్తామని బెదిరించారు. దీంతో భయపడిపోయిన ఆమె దాదాపు నెలన్నర పాటు లోలోపల కుమిలిపోయింది. అయితే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో తన తల్లికి అసలు విషయం చెప్పింది.

ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కమతంవారిపల్లెకు చెందిన ముగ్గురు నిందతులను అరెస్ట్ చేశారు. అస్రఫ్ బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నాడు. జయచంద్ర స్థానికంగా పూలహారాలు కడుతూ జీవిస్తున్నాడు. షామీర్ ప్రైవేట్ వాహనాల డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.