కర్నూలులో దారుణ ఘటన చోటు చేసుకుంది. అర్థరాత్రి ఓ ఇంట్లోకి దూరిన ముగ్గురు తాగుబోతులు మామను కట్టేసి.. కోడలి మీద అత్యాచారానికి ప్రయత్నించారు. 

కర్నూలు : liquor మత్తులో ఓ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు వ్యక్తులు.. బయట నిద్రిస్తున్న వ్యక్తికి నోట్లో గుడ్డలు కుక్కి.. కాళ్లు, చేతులు కట్టి పడేసి ఇంట్లో నిద్రిస్తున్న ఆయన కోడలిపై molestationకి ప్రయత్నించారు. ఆమె గట్టిగా కేకలు వేస్తూ బయటికి రావడంతో వారు పారిపోయారు. kurnool జిల్లా కోసిగి మండలం పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళా, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... సోమవారం రాత్రి ఆ మహిళ తన భర్త, కుమార్తెతో ఇంట్లో నిద్రిస్తుంది. మామ ఇంటి బయట మంచంపై పడుకున్నాడు. 

రాత్రి 11 గంటల సమయంలో ఆమె భర్త బహిర్భూమికి వెళ్లాడు. అదే సమయంలో గ్రామానికి చెందిన తలారి హనుమేష్, పాటప్ప, కృష్ణమూర్తి మద్యం మత్తులో ఆ ఇంట్లోకి చొరబడ్డారు. బయట పడుకున్న ఆమె మామ నోట్లో గుడ్డలు కుక్కి కాళ్లు, చేతులు కట్టేశారు. మహిళపై అత్యాచార యత్నం చేశారు. ఆమె గట్టిగా కేకలు వేస్తూ.. వారి నుంచి తప్పించుకుని బయటకు వచ్చింది. చుట్టుపక్కల వారు లేచి వచ్చేసరికి నిందితుడు అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు, భర్తతో కలిసి బాధితురాలు కోసిగి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

ఇలాంటి ఘటనే, నిరుడు సెప్టెంబర్ లో రాజస్థాన్ లో జరిగింది. రాత్రి కూతురు గది నుంచి ఏదో అలజడి రావడంతో తండ్రి నిద్రలేచాడు. ఏమైందో అని అక్కడికి వెళ్తుంటే గదిలోనుంచి ఓ వ్యక్తి పారిపోవడం గమనించాడు. పట్టుకుందాం అనుకునే లోపే అతను పారిపోయాడు. దొంగతనం చేయడానికి వచ్చాడేమో అని తండ్రి అనుమానించాడు. కానీ ఆ తర్వాత అసలు విషయం చెప్పడంతో కుప్పకూలిపోయాడు.

రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాకు చెందిన అంకిత్ అనే వ్యక్తి తన ప్రాంతంలో నివసిస్తున్న15 ఏళ్ల యువతిపై కన్నేశారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న అతను ఓ రోజు అర్థరాత్రిసమయంలో ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాడు. పై గదిలో ఒంటరిగా ఉన్న ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కింద గదిలో పడుకున్న తండ్రికి పై గది నుంచి ఏవో శబ్దాలు రావడంతో నిద్రలేచాడు. ఏమైందోనని పైకి వెళుతుండగా కూతురు గది నుంచి ఓ యువకుడు పారిపోవడం గమనించాడు.

మొదట దొంగేమో అని అనుకున్నాడు. కానీ కూతురు గదిలోకి వెళ్లి గమనించగా ఏదో అనుమానం కలిగింది. కూతుర్ని ప్రశ్నించగా ఆమె జరిగిన విషయం తండ్రికి చెప్పింది. అది విని తండ్రి షాక్కు గురయ్యాడు. అంకిత్ అనే వ్యక్తి తనని అత్యాచారం చేశాడని తెలిపింది. నోట్లో గుడ్డలు కుక్కి, అరిస్తే చంపేస్తానని బెదిరించి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని వివరించింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.