నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మనుబోలు మండలం బద్దెవోలు వద్ద లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు.
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మనుబోలు మండలం బద్దెవోలు వద్ద కంటైనర్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఐదుగురు గాయపడ్డారు ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆగి ఉన్న కంటైనర్‌ను కారు వెనకాల నుంచి వచ్చి ఢీకొట్టిందని చెబుతున్నారు. రహదారిపై నిబంధనలకు విరుద్దంగా కంటైనర్‌ను రోడ్డుపై నిలిపి ఉంచినట్టుగా తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
