శనివారం ఉదయం ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.  బైకును లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ప్రకాశం :  ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో  శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వ దగ్గర  ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బైకును లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి  చెందారు. మృతులు అంబాపురం వాసులు వినోద్, నాని, వీరేంద్రలుగా గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.