అనంతపురం: అనంతపురం జిల్లాలో ముగ్గురు విద్యార్థినులు గురువారం నాడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. బస్టాండ్ ఆవరణలో అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినులను స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు.

Also read:అమరావతి: బస్సు యాత్ర, బాబును అడ్డుకొంటామన్న ఉత్తరాంధ్ర మేధావులు

వడ్డీ వ్యాపారి వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్టుగా విద్యార్థినులు తెలిపారు. వడ్డీ వ్యాపారి నుండి రూ. 20 వేలను విద్యార్ధినులు అప్పుగా తీసుకొన్నారు. 

ఈ డబ్బుల కోసం విద్యార్ధినులను వడ్డీ వ్యాపారి వేధించినట్టుగా పోలీసులకు విద్యార్ధినులు తెలిపారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధినుల నుండి పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు.