ఇంద్ర కీలాద్రిపై కరోనా కలకలం: మూడుకు చేరిన మరణాలు
విజయవాడలోని ఇంద్ర కీలాద్రిపై కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఈ రోజు ఓ ఎన్ఎంఆర్ కరోనా వ్యాధితో మృత్యువాత పడ్డాడు. దీంతో మరణాల సంఖ్య మూడుకు చేరుకుంది.
విజయావడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో గల ఇంద్ర కీలాద్రిపై కరోనా కలకలం సృష్టిస్తోంది. బుధవారం తెల్లవారు జామున కరోనా ఒకరు మరణించారు. ఎన్ఎంఆర్ గా పనిచేస్తున్న ఆకుల హరి మృత్యువాత పడ్డాడు.
దాంతో ఇంద్రకీలాద్రిపై కోరనాతో మరణించినవారి సంఖ్య మూడుకు చేరుకుంది. మంగళవారం ఆలయ ఆర్చకుడు రాఘవయ్య కోవిడ్ తో మరణించాడు. నాలుగు రోజుల క్రితం మరో అర్చకుడు మరణించాడు. పలువురు ఉద్యోగులు కరోనా వ్యాధితో బాధపడుతున్నారు.
ఇంద్రకీలాద్రిపై కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అమ్మవారి దర్శనం వేళలను కుదించారు. ఉదయం 6 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. తిరుమలలోనూ కరోనా వైరస్ తన ప్రతాపం ప్రదర్శిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది.