లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన: రైలుకు వేలాడుతూ వెళ్తున్న ముగ్గురి అరెస్ట్
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తమ స్వంత గ్రామాలకు వెళ్లేందుకు వలస కూలీలు ప్రయత్నించి పోలీసులకు పట్టుబట్టారు. ఈ ముగ్గురిని క్వారంటైన్ కు తరలించారు. శ్రీకాకుళం జిల్లా అధికారులు.
శ్రీకాకుళం: కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తమ స్వంత గ్రామాలకు వెళ్లేందుకు వలస కూలీలు ప్రయత్నించి పోలీసులకు పట్టుబట్టారు. ఈ ముగ్గురిని క్వారంటైన్ కు తరలించారు. శ్రీకాకుళం జిల్లా అధికారులు.
ఒడిశా రాష్ట్రానికి చెందిన ముగ్గురు వలస కార్మికులు విశాఖపట్టణంలో కూలీ పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను కేంద్రం ఈ ఏడాది మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించింది.
ఒడిశా నుండి విశాఖ పట్టణంలో కూలీ పనులు చేసుకొంటున్న ముగ్గురు వలస కూలీలు భువనేశ్వర్ కు వెళ్లాలని భావించారు. అయితే వాహనాలు లేవు. దీంతో సరుకులు తరలించే గూడ్స్ రైళ్లలో భువనేశ్వర్ కు వెళ్లాలని వీరు ప్లాన్ చేశారు.
also read:లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘనలు: ఆర్మీని దించాలంటూ సుప్రీంలో పిటిషన్
విశాఖపట్టణం నుండి భువనేశ్వర్ వెళ్లే గూడ్స్ రైలు చివరన ఉండే చిన్న ఇనుపరాడ్డును పట్టుకొని వీరు ప్రయాణం ప్రారంభించారు. విశాఖ నుండి శ్రీకాకుళం జిల్లా పలాస వరకు వీరిని ఎవరూ కూడ గమనించలేదు.
పలాస రైల్వే స్టేషన్ వద్ద ఈ ముగ్గురిని జీఆర్‌పీ పోలీసులు చూశారు. రైలు నుండి వారిని దింపారు. ఈ ముగ్గురిని పలాస ఎస్టీ బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ శిబిరానికి ఈ ముగ్గురిని తరలించారు.