సంక్రాంతికి వచ్చిన కొత్త అల్లుడికి వంటలకాలతో షాక్ ఇచ్చిందో అత్తగారు. గోదావరి జిల్లాల్లో జరిగిన ఈ ఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరస్ అయ్యింది. మర్యాదలకు మారు పేరు అని తెలుగు రాష్ట్రాల్లో అందరూ చెబుతారు. సంక్రాంతి పండుగ వస్తే చాలు ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెలన్నీ కళకళలాడుతాయి. 

"

సాధారణంగా సంక్రాంతి పండుగకు కొత్త అల్లుళ్లు అత్తవారింటికి వెళ్తుంటారు. వారికి అత్తమామలు ఘనంగా మర్యాదలు చేయడం మన సంప్రదాయం. అయితే గోదారాళ్ల మర్యాదల సంగతి చెప్పేదేముంది.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి ఓ అత్త తన చేతివాటం చూపించింది. 

125 రకాల వంటలు చేసి ముందుపెట్టి అల్లుడు అబ్బురపోయేలా చేసింది. మొత్తం 125 వంటలు అల్లుడి ముందు పెట్టి, పక్కన కూతుర్ని కూర్చోపెట్టింది. ఇక, ఆ అల్లుడి పరిస్థితి ఊహించండి! వంటలన్నీ తినెయ్యాలన్న కోరిక ఉన్నా, అన్నీ తింటే ఇంకేమైనా ఉందా?

మొత్తానికి ఆ అల్లుడు ఎలాగోలా కష్టపడి అన్ని వంటలు అలా.. అలా.. రుచి చూసి.. బ్రేవ్, అంటూ ‘పొట్ట చేత పట్టుకుని’ హమ్మయ్యా అని ముగించాడు. అత్తింటి వారు చూపించిన మమకారానికి ఫిదా అయిపోయాడు. మొత్తాని ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు ‘ఔరా..’ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.