విజయవాడ: విజయవాడ వన్‌టౌన్ లోని సాయిచరణ్ జ్యుయలరీలో శుక్రవారం నాడు భారీ దోపీడీ చోటు చేసుకొంది.నిందితులు 7 కిలోల బంగారం, రూ. 30 లక్షల నగదును చోరీ చేసినట్టుగా యాజమాన్యం తెలిపింది. 

 శుక్రవారం నాడు భారీ దోపీడీ చోటు చేసుకొంది. పట్టపగలే దుకాణంలోకి వెళ్లి బంగారం, నగదును చోరీ చేశారు. ఆ దుకాణంలో పనిచేసే సిబ్బంది కాళ్లు, చేతులు కట్టేసి దోపీడీకి పాల్పడ్డారు. ఈ ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

బంగారం తయారీ కోసం చేసే వాళ్లే ఈ ఘటనను పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రతి రోజూ బంగారం ఆభరణాలను దుకాణానికి తీసుకెళ్లేందుకు విక్రం సింగ్ వచ్చాడు. అయితే  అతనిని బంధించి దుండగులు చోరీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

ఈ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటన పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే చోటు చేసుకొంది. ఈ దోపీడీకి పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తెలిసిన వారే ఈ దోపీడీకి పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దోపీడీకి పాల్పడిన వారిని గుర్తించేందుకు ఐదు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టుగా పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.