40 మంది ప్రయాణికులతో కూడిన బస్సును నడుపుతున్న డ్రైవర్ కు ఒక్క సారిగా గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో కూడా ఆయన ప్రయాణికుల భద్రత ఆలోచించి అతి కష్టం మీద బస్సును నిలిపివేశాడు. దీంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. కానీ కొంత సమయం తరువాత డ్రైవర్ చనిపోయారు. 

బ‌స్సు న‌డుపుతున్న స‌మ‌యంలో డ్రైవ‌ర్ కు గుండెపోటు వ‌చ్చింది. దీంతో ఆయ‌న తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. అయితే ఆయ‌న అప్ర‌మ‌త్త‌మై బ‌స్సును ఒక ప‌క్క‌కు తీసుకొచ్చి నిలిపివేసి ప్ర‌యాణికులు ప్రాణాలు కాపాడారు. కానీ కొంత స‌మ‌యానికే ఆయ‌న మృతి చెందాడు. ఈ విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. 

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ (APS RTC) కి చెందిన బ‌స్సు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం తిరుప‌తి (tirupathi) నుంచి పుంగ‌నూరు (punganuru) కు బ‌య‌లుదేరింది. ఈ స‌మ‌యంలో బ‌స్సులో 40 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. అయితే చిత్తూరు (chitturu) జిల్లా నాయుడుపేట (nayudupeta) పూత‌ల‌ప‌ట్టు (puthalapattu) జాతీయ రాహ‌దారి పైన అగ‌రాల గ్రామ స‌మీపంలోకి చేరుకునే స‌రికి డ్రైవ‌ర్ బి.ర‌వి (b.ravi) కి అక‌స్మాత్తుగా గుండెపోటు వ‌చ్చింది. దీంతో ఆయ‌న తీవ్ర అస్వస్థ‌త‌కు గుర‌య్యారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌యాణికుల‌కు ఏమీ కాకుడ‌ద‌నే ఉద్దేశంతో, స‌మ‌య‌స్పూర్తితో బ‌స్సును ఒక ప‌క్క‌కు తీసుకొచ్చి ఆపేశాడు. 

బ‌స్సులో ఉన్న ప్ర‌యాణికులు దీనిని గ‌మ‌నించి వెంటేనే అంబులెన్స్ కు సమాచారం అందించారు. దాని ద్వారా అత‌డిని స‌మీపంలోని హాస్పిట‌ల్ కు తీసుకెళ్లారు. కానీ ఆయ‌న అప్ప‌టికీ మృతి చెందార‌ని డాక్ట‌ర్లు నిర్ధారించారు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు కూడా అక్క‌డికి చేరుకొని ప్ర‌యాణికుల కోసం ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.