ఒంగోలు: ప్రకాశం జిల్లా చీరాల వాడరేవులో సోమవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది.  మత్స్యకారులను పరామర్శించిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. మత్య్సకారులు ఆమంచి వర్గీయుడిపై దాడి చేశారు. అంతేకాదు ఈపురుపాలెం ఎస్ఐపై కూడ మత్స్యకారులు దాడికి దిగారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకొంది.

చీరాల వాడరేవులో  మత్స్యకారులను ఎంపీ మోపిదేవి వెంకటరమణ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోమవారం నాడు వెళ్లారు.

మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు వ్యతిరేకంగా మత్స్యకారులు నినాదాలు చేశారు. ఆమంచి వర్గీయుడిని మత్స్యకారులు దాడి చేశారు. దీనిని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు.

ఈపురుపాలెం ఎస్ఐ వాహనంపై  మత్స్యకారులు  రాళ్లతో దాడికి దిగారు. వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి.ఈ ఘటనతో ఉద్రిక్తత చోటు చేసుకొంది.