చంద్రబాబు కుప్పం టూర్ లో ఉద్రిక్తత: టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి
చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలం కొల్లుపల్లిలో బుధవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
చంద్రబాబు పర్యటించే ప్రాంతాల్లో టీడీసీ జెండాలు కట్టిన ప్రాంతంలోనే వైసీపీ జెండాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ జెండాలను తొలగించేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి.. ఈ విషయమై రెండు పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఇరు వర్గాలకు నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే జెండాల విషయంలో రెండు పార్టీల శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. రెండు పార్టీలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించినా పలితం లేకపోయింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడికి దిగాయి. దీంతో పోలీసులతో పాటు టీడీపీ, వైసీపీ వర్గాలతో పాటు సీఐ, ఎస్ఐ లకు కూడా గాయాలయ్యాయి.
మరో వైపు కొంగనపల్లిలో చంద్రబాబు కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి వైసీపీకి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన టీడీపీ శ్రేణులు అతడిని చితకబాదారు. అయితే స్థానికులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది