Asianet News TeluguAsianet News Telugu

పీఆర్సీ : ఏపీలో ఉద్యోగుల కలెక్టరేట్ల ముట్టడి, ఉద్రిక్తత

పీఆర్సీ జీవోలను నిరసిస్తూ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముందు ఆందోళనలు సాగాయి. కలెక్టరేట్ల ఆందోళన సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకొంది.
 

Tension prevails after employees protest collectorates in Andhra pradesh
Author
Guntur, First Published Jan 20, 2022, 4:18 PM IST

అమరావతి: Prc కొత్త జీవోలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నాడు ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో ఆందోళనలు సాగాయి. పలు collectorate వద్ద protestతో ఉద్రిక్తత చోటు చేసుకొంది.  కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు వెళ్తున్న employees, teachers సంఘాల నేతలు, కార్యకర్తలను police అదుపులోకి తీసుకొన్నారు. ఆయా కలెక్టరేట్ల వద్ద జరిగిన ఆందోళనలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ రోడ్డున పడ్డారంటే దానికి పీఆర్సీపై ఇచ్చిన జీవోలే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చీకటి జీవోలను వెంటనే  రద్దు చేసి ఇంతకుముందు పీఆర్సీ ఎలా అమలు చేసేవారో ఆ విధంగా ఇవ్వాలని  డిమాండ్ చేశారు. పాత hraకొనసాగించాలని డిమాండ్ చేశారు. జగన్‌గారిని ఎంతో నమ్ముకున్నాం.. కానీ ‘‘అంతన్నాడు ఇంతన్నాడే జగన్‌గారు.. నట్టేట ముంచేసారే జగన్‌గారు’’ అంటూ పాడారు. 

‘ఓ మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రిగారూ....ఉద్యోగులకిచ్చిన చేతిబాసలు ఏమాయే సారూ.. ముద్దుల మీద ముద్దులు పెట్టిన ముఖ్యమంత్రిగారూ....మీ పాదయాత్రలో ఇచ్చిన హామీ నిలుపుకోండి మీరు’’ అంటూ పాట పాడారు.

ఇవాళ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారంటే సీఎం జగన్ అర్ధరాత్రి విడుదల చేసిన జీవోలే కారణమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ జీవోలను రద్దు చేసి, న్యాయబద్ధమైన పీఆర్సీ అమలు చేయాలని ఉద్యోగులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

పీఆర్సీపై ఏకపక్ష జీవోలు జారీ చేసిన జగన్ ప్రభుత్వంపై ఏపీ ఉద్యోగ సంఘాలు సమరానికి సిద్ధమయ్యాయి. సమ్మె అస్త్రాన్ని ప్రయోగించనున్నాయి.  ఈ నేపథ్యంలో ఉద్యోగులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పాట రూపంలో నిరసన తెలిపారు. ‘

రాష్ట్రాభివృద్దిలో ఉద్యోగుల పాత్ర కీలకం: టీడీపీ

ఏ ప్రభుత్వమైనా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే. ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని tdp  రాష్ట్ర కార్యదర్శి దేవతోటి Naga raju అన్నారు.  ప్రభుత్వ ఉద్యోగులను Ycp ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి జీతాలు పెంచమనే స్థాయి నుంచి "తగ్గించొద్దు మహాప్రభో" అని వేడుకొనే పరిస్థితి దాకా వచ్చిందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు chandrababu పరిపాలన ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. ఉద్యోగుల పరిస్థితి పాలిచ్చే బర్రెని వదిలేసి తన్నించుకునే దున్నపోతును చేరదీసినట్లు ఉందని దేవతోటి నాగరాజు వ్యాఖ్యలు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios