రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యల్ని ప్రస్తావిస్తూ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పర్యటన చేయాలని తెలుగు యువత నిర్ణయించింది. శ్రీకాకుళంలో సెప్టెంబర్ 5వ తేదీన మొదలై 29 సెప్టెంబర్ వరకు ఈ యాత్ర జరగనుంది.
తెలుగుదేశం పార్టీ అనుబంధ తెలుగు యువత భారీ యాత్రకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యల్ని ప్రస్తావిస్తూ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పర్యటన చేయాలని తెలుగు యువత నిర్ణయించింది. ‘‘ జాబు కావాలంటే ...జగన్ పోవాలి ’’ అనే నినాదంతో సాగే ఈ యాత్ర శ్రీకాకుళంలో సెప్టెంబర్ 5వ తేదీన మొదలై 29 సెప్టెంబర్ వరకు జరగనుంది. రాష్ట్రంలోని 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు చెందిన గ్రామస్థాయి, మండల స్థాయి నుండి యువతను భాగస్వాములు చేస్తూ యాత్ర నిర్వహిస్తామని తెలుగు యువత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
యాత్ర జరిగే ప్రాంతాలు, తేదీలు
తేదీ పార్లమెంట్
సెప్టెంబర్ 5 శ్రీకాకుళం
సెప్టెంబర్ 6 అరకు
సెప్టెంబర్ 7 విజయనగరం
సెప్టెంబర్ 8 విశాఖపట్నం
సెప్టెంబర్ 9 అనకాపల్లి
సెప్టెంబర్ 10 కాకినాడ
సెప్టెంబర్ 11 అమలాపురం
సెప్టెంబర్ 12 రాజమండ్రి
సెప్టెంబర్ 13 నర్సాపూర్
సెప్టెంబర్ 14 ఏలూరు
సెప్టెంబర్ 15 మచిలీపట్నం
సెప్టెంబర్ 16 విజయవాడ
సెప్టెంబర్ 17 గుంటూరు
సెప్టెంబర్ 18 నరసరావుపేట
సెప్టెంబర్ 19 బాపట్ల
సెప్టెంబర్ 20 ఒంగోలు
సెప్టెంబర్ 21 నెల్లూరు
సెప్టెంబర్ 22 తిరుపతి
సెప్టెంబర్ 23 చిత్తూరు
సెప్టెంబర్ 24 రాజంపేట
సెప్టెంబర్ 25 కడప
సెప్టెంబర్ 26 కర్నూల్
సెప్టెంబర్ 27 నంద్యాల
సెప్టెంబర్ 28 హిందూపురం
సెప్టెంబర్ 29 అనంతపురం
