వాలంటీర్ , సచివాలయ వ్యవస్థకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తన స్పష్టమైన విధానాన్ని ప్రకటించింది. టీడీపీ అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్ధతను మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దుతామని పొలిట్‌బ్యూరో తెలిపింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వాలంటీర్ వ్యవస్థపై తన విధానాన్ని ప్రకటించింది. శనివారం సమావేశమైన టీడీపీ పొలిటీబ్యూరో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టీడీపీ .. వాలంటీర్ , సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తుందనడం అపోహేనన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్ధతను మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దుతామని పొలిట్‌బ్యూరో తెలిపింది. వేధింపులకు తావు లేకుండా జవాబుదారీగా వుండేలా చూస్తామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబ్ వెల్లడించారు.
