మెదక్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో కోడలిగా తెలంగాణకు చెందిన ఐపీఎస్ అధికారిణి అడుగుపెట్టబోతున్నారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అతి త్వరలోనే ఆమె వైయస్ జగన్ కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టబోతుందంటూ వార్తలు వెలువడుతున్నాయి.

తమ బంధువుల ఇంట కోడలిగా అడుగుపెట్టబోతున్న ఆ మహిళా ఐపీఎస్ అధికారికి సీఎం వైయస్ జగన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇంతకీ ఆ మహిళా ఐపీఎస్ అధికారి ఎవరు, ఆమెను వివాహం చేసుకోబోతున్న జగన్ బంధువు ఎవరా అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో మంచి ఐపీఎస్ అధికారిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు మెదక్ ఎస్పీ చందన దీప్తి. అందంతోనే కాదు పనితనంలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ అందరి మన్నలను అందుకుంటున్నారు.  

అయితే ఆ ఐపీఎస్ అధికారి చందన దీప్తి ఇంట పెళ్లి భాజాలు మోగబోతున్నాయంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. త్వరలోనే ఆమె వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.  

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమీప బంధువుతో ఎస్పీ చందన దీప్తికి పెళ్లి కుదిరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటి కానున్నట్లు సమాచారం.  

ఇకపోతే వరుడు విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసిస్తున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో ఆయన స్వదేశానికి రానున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కనస్ట్రక్షన్ మరియు హాస్పటాలిటీ వ్యాపార రంగంలో స్థిరపడనున్నట్లు తెలుస్తోంది.  

అయితే వరుడు సీఎం జగన్ కు స్వయానా బంధువు కావడంతో ఈ పెళ్లిపట్ల చాలా ఆసక్తి నెలకొంది. ఇంతకీ ఎవరా బంధువు, ఎవరా వరుడు అంటూ అంతా చర్చించుకుంటున్నారట. కొందరైతే సోషల్ మీడియాలోకి వెళ్లి వైయస్ జగన్ కుటుంబం, బంధువుల పుట్టుపూర్వోత్తరాలు వెతికే పనిలో పడ్డారట. 

ఈ వార్తలు కూడా చదవండి

లవ్ చేసే పెళ్లి చేసుకుంటానంటున్న మెదక్ ఎస్పీ చందన దీప్తి

ఐపిఎస్ లు చాలా మందే ఉంటారు.. ఈమె చాలా మందికి భిన్నం