తెలంగాణ సీఎం కేసీఆర్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున మహాద్వారం ద్వారా కుటుంబసభ్యులతో కలిసి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయక మండపంలో కేసీఆర్‌కు వేదపండితులు ఆశీర్వచనం చేశారు.

ఆదివారం సాయంత్రమే కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సంగతి తెలిసిందే. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కేసీఆర్‌కు వైసీపీ ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు.

అనంతరం రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్న ఆయనకు శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికారు. మరోవైపు ఇవాళ కేసీఆర్ సతీమణి శోభా రాణి, కోడలు, మనవడు ఇతర కుటుంబసభ్యులు ఆదివారం సాయంత్రం శ్రీవారి పాదాలను, శిలాతోరణంను సందర్శించారు.