ఏలూరు: ప్రేమోన్మాది సుధాకర్ రెడ్డి చేతిలో కత్తిపోట్లకు గురైన తేజస్విని పాలకొల్లు ఆసుపత్రిలో కోలుకొంటుంది. తేజస్వినిని ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. తేజస్విని ప్రస్తుతం కోలుకొంటుందని వైద్యులు ప్రకటించారు.

రెండో పెళ్లి చేసుకోవాలని  తేజస్వినిని సుధాకర్ రెడ్డి వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇదే విషయమై  తేజస్వినిపై సుధాకర్ రెడ్డి బుధవారం నాడు ఉదయం కత్తితో విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తేజస్విని  తీవ్రంగా గాయపడింది.

స్థానికులు తేజస్విని పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో తేజస్విని చికిత్స పొందుతుంది. బుధవారం నుండి తేజస్వినిని ప్రత్యేక వైద్యుల బృందం  చికిత్స చేస్తోంది.

తేజస్వినిపై దాడి చేసిన తర్వాత సుధాకర్ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో సుధాకర్ రెడ్డిని కూడ పాలకొల్లు ఆసుపత్రికి తరలించారు. అదే ఆసుపత్రిలో కూడ ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

సుధాకర్ రెడ్డి నుండి  రెండు కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. చాలా కాలంగా తేజస్వినిపై  దాడి చేయాలని ప్లాన్ చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయమై ఎంత కాలంగా సుధాకర్ రెడ్డి తేజస్వినిపై దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

సుధాకర్ రెడ్డికి ఇప్పటికే వివాహమైంది. ఆయనకు భార్య కూడ ఉంది. అయితే సుధాకర్ రెడ్డి తేజస్వినిని రెండో పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ విషయమై తేజస్విని సుధాకర్ రెడ్డి వేధింపులను భరించింది. 

బుధవారం నాడు కాలేజీకి వెళ్తున్న తేజస్వినిని సుధాకర్ రెడ్డి వెంటాడి  కత్తితో విచక్షణ రహితంగా  పొడిచాడు. ఆ సమయంలో తేజస్విని రక్షించాలని అరవడంతో స్థానికులు సుధాకర్ రెడ్డి బారీ నుండి ఆమెను రక్షించారు. స్థానికులను బెదిరించి సుధాకర్ రెడ్డి ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో స్థానికులు సుధాకర్ రెడ్డిని తాళ్తతో కట్టిపడేశారు.

తేజస్వినిపై ఆసుపత్రికి తరలించిన తర్వాత సుధాకర్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతడిని కూడ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోనే సుధాకర్ రెడ్డి చికిత్స పొందుతున్నాడు. 

తేజస్వినిపై దాడి చేసేందుకు సుధాకర్ రెడ్డి చేసిన ప్లాన్ ఏమిటనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ట్రీట్ మెంట్ పూర్తైన తర్వాత సుధాకర్ రెడ్డిని పోలీసులు విచారించనున్నారు.  ఈ మేరకు పోలీసులు రంగం సిద్దం చేసుకొన్నారు.

మరో వైపు తేజస్వినిని ప్రత్యేక వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఆమె క్రమంగా కోలుకొంటుందని  వైద్యుల బృందం ప్రకటించింది.తేజస్వినిని కోలుకొన్న తర్వాత ఆమెను ఆసుపత్రి నుండి డిశ్చార్జి చేస్తామని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.