అక్టోబ్ 1 నుంచి 25 వరకు రోజుకు 8 వేల టికెట్ల చొప్పున అందుబాటులో ఉంచింది. దీంతో పెద్ద ఎత్తున భక్తులు వాటిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో టీటీడీ వెబ్ సైట్ లో సాంకేతిక సమస్య ఏర్పడిందని అధికారులు తెలిపారు.

టీటీడీ వెబ్ సైట్లో (TTD Website) సాంకేతిక సమస్య (Techinical Issue) తలెత్తింది. దీంతో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్ (Tickets Booking) నిలిచిపోయింది. ఆన్ లైన్ లో టికెట్ల కొనుగోలుకు భారీగా భక్తులు యత్నించడంతో సమస్య ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు. అక్టోబర్ నెలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తితిదే ఆన్ లైన్ లో విడుదల చేసింది. 

అక్టోబ్ 1 నుంచి 25 వరకు రోజుకు 8 వేల టికెట్ల చొప్పున అందుబాటులో ఉంచింది. దీంతో పెద్ద ఎత్తున భక్తులు వాటిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో టీటీడీ వెబ్ సైట్ లో సాంకేతిక సమస్య ఏర్పడిందని అధికారులు తెలిపారు.

గతంలోనూ పలుమార్లు ఇదే తరహా సమస్య వచ్చింది. దీన్ని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సాంకేతిక సమస్యను పరిష్కరించిన తర్వాత ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లపై టీటీడీ ప్రకటన చేసే అవకాశముంది.