Asianet News TeluguAsianet News Telugu

79 నెంబర్లతో కావ్యకు సురేష్ రెడ్డి ఫోన్లు: రెండేళ్లుగా కావ్యకు సురేష్ రెడ్డి వేధింపులు

నెల్లూరు జిల్లాలోని తాటిపర్తిలో టెక్కీ కావ్యను హత్య చేసిన తర్వాత సురేష్ రెడ్డి ఆత్మహత్య చేసుకొన్న ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండేళ్లుగా కావ్యను సురేష్ రెడ్డి వేధిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. 

Techie Suresh Reddy Used 79 SIM Cards For talking To Kavya
Author
Nellore, First Published May 10, 2022, 4:13 PM IST

నెల్లూరు: రెండేళ్ల నుండి ప్రేమ పేరుతో కావ్యను మాలపాటి Suresh Reddy వేధింపులకు గురి చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. Kavya, సురేష్ రెడ్డిలకు సంబంధించిన ఫోన్ చాటింగ్ ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండేళ్లుగా కావ్యను సురేష్ వేధిస్తున్నట్టుగా Police  గుర్తించారు. కావ్యకు వేర్వేరు ఫోన్లతో మేసేజ్ లతో పాటు Chatting చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. సురేష్ రెడ్డి 79 నెంబర్లను ఉపయోగించి కావ్యకు ఫోన్ చేశాడని పోలీసులు గుర్తించారు. కొత్త కొత్త నెంబర్లతో సురేష్ రెడ్డి కావ్యను వేధింపులకు గురి చేశాడు. సురేష్ రెడ్డి ఉపయోగించిన 79 నెంబర్లను కావ్య బ్లాక్ చేసిందని పోలీసులు గుర్తించారు. సురేష్ రెడ్డి, కావ్యల మధ్య జరిగిన చాటింగ్ ను కూడ పోలీసులు గుర్తించారు. పెళ్లికి నిరాకరించడంతోనే సురేష్ రెడ్డి కావ్యను చంపాలని నిర్ణయించుకొన్నాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

కావ్యను పెళ్లి చేసుకోవాలని సురేష్ రెడ్డి భావించాడు. ఈ విషయమై కావ్య కుటుంబసభ్యులతో మధ్యవర్తుల ద్వారా రాయబారం పంపాడు. అయితే సురేష్ రెడ్డిని వివాహం చేసుకొనేందుకు కావ్య నిరాకరించింది. కావ్య ఈ పెళ్లికి ఒప్పుకొంటే  ఈ పెళ్లి చేసేందుకు కావ్య పేరేంట్స్ కూడా సిద్దంగా ఉన్నారని Tatiparthi  గ్రామస్థులు చెప్పారు. కానీ కావ్య మాత్రం marriageకి ఒప్పుకోలేదు. గత మాసంలోనే సురేష్ రెడ్డి మధ్య వర్తుల ద్వారా పెళ్లికి రాయబారం పంపిన విషయాన్ని పోలీసులు గుర్తించారు.

సోమవారం నాడు మధ్యాహ్నం కావ్య ఇంట్లో పెద్దలు ఎవరూ లేరని తెలుసుకొన్న సురేష్ రెడ్డి కావ్య ఇంటికి వచ్చి ఆమెపై తుపాకీతో కాల్పులకు దిగాడు. మొదటి బుల్లెట్ నుండి ఆమె తప్పించుకొంది. రెండో బుల్లెట్  కావ్య కంట్లో నుండి  తలలోకి దూసుకెళ్లింది. కావ్యను ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో  కావ్య మరణించింది. కావ్యపై కాల్పులు జరిపిన తర్వాత సమీపంలోని స్కూల్ ఆవరణలోకి వెళ్లి సురేష్ రెడ్డి తనను కాల్చుకొని చనిపోయాడు.

మాలపాటి సురేష్ రెడ్డికి తుపాకీ ఎక్కడి నుండి వచ్చిందనే విషయమై పోలీసులు ఆరా  తీస్తున్నారు. సురేష్ రెడ్డి ఉపయోగించిన తుపాకీలో బుల్లెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.మరో వైపు కావ్యను ఇచ్చి పెళ్లి చేయాలని సురేష్ రెడ్డి గతంలో కావ్య కుటుంబానికి రాయబారం పంపిన విషయం వాస్తవమేనని సురేష్ తల్లి చెప్పారు. కానీ సురేష్ రెడ్డి ఏ విషయాన్ని తనకు చెప్పలేదన్నారు. సురేష్ రెడ్డి సైకో మనస్తత్వం కలవాడని కావ్య బంధువు మీడియాకు చెప్పారు. సురేష్ రెడ్డిని పెళ్లి చేసుకొనేందుకు కావ్య ఒప్పుకుంటే  ఈ ఘటన జరిగేది కాదన్నారు. అయితే సురేష్ రెడ్డికి, కావ్యల మధ్య వయస్సు మధ్య తేడా కూడా ఎక్కువగా ఉందని కావ్య పేరేంట్స్ చెబుతున్నారు. ఇది కూడా ఈ పెళ్లికి ఆటంకంగా మారింది.

గతంలో కూడ ప్రేమించలేదని  యువతులపై దాడులు చేసి హత్యలు చేసిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. ఇటీవలనే ఏపీ రాష్ట్రంలోని గుంటూరులో బీటెక్ విద్యార్ధిని రమ్యను శశికృష్ణ కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన 2021 ఆగష్టు 15న హత్య చేశాడు.  ఈ ఘటనపై గత మాసంలోనే శశికృష్ణకు గుంటూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరి శిక్ష విధించింది.

Follow Us:
Download App:
  • android
  • ios