Asianet News TeluguAsianet News Telugu

యూట్యూబ్ వీడియోలకు లైక్ కొడితే డబ్బులు.. రూ. 19 లక్షలు మోసపోయిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్..

పార్ట్ టైం జాబ్ అని ఆశపడిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రూ. 19లక్షలు పోగొట్టుకున్న ఘటన విజయవాడలో వెలుగు చూసింది. యూట్యూబ్ వీడియోలకు లైక్ కొడితే డబ్బులిస్తామంటూ మోసం చేశారు. 

techie loses rs. 19 lakh over fraudsters in vijayawada - bsb
Author
First Published May 23, 2023, 4:12 PM IST

అమరావతి : సైబర్ నేరగాళ్ల చేతిలో పడి ఓ  సాఫ్ట్వేర్ ఇంజనీర్ రూ. 19 లక్షలు పోగొట్టుకుంది. పార్ట్ టైం జాబ్ అంటూ..  ఖాళీ సమయాల్లో ఇంట్లోనే ఉండి లక్షలు సంపాదించొచ్చు అంటూ  కేటుగాళ్లు వేసిన వాళ్లలో.. ఓ టెకీ చిక్కుకుంది. ‘ఇంటి దగ్గరే ఉండి.. ఇష్టమైన  సమయంలో ఉద్యోగం.. పార్ట్ టైం జాబ్ చేసి భారీగా సంపాదించే అవకాశం..’ అంటూ యువతకు పెద్ద ఎత్తున గాలం వేస్తున్నారు కేటుగాళ్లు. తమ వాళ్ళలో చిక్కుకున్న వారి నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

కేటుగాళ్లు చేసే ప్రకటనలను నిజమని నమ్మితే.. అంతే సంగతులు.  ఈ వలలో పడి పలువురు ప్రైవేటు ఉద్యోగులు, నిరుద్యోగులు మోసపోతున్న ఘటనలో వెలుగు చూస్తున్నాయి. తాజాగా వీరి వలలో పడ్డ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ భారీగా మోసపోయిన ఘటన  ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో వెలుగు చూసింది. విజయవాడకు చెందిన ఓ యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఓ టెక్ కంపెనీలో  పనిచేస్తోంది. ఈ క్రమంలో ఓ రోజు ఆమె మొబైల్ కి మెసేజ్ వచ్చింది. ఖాళీ సమయాల్లో పార్ట్ టైం జాబ్.. తక్కువ పని, ఎక్కువ డబ్బులు  సంపాదించవచ్చు అంటూ ఆ మెసేజ్ లో ఉంది. 

దాంతోపాటు  ఓ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆసక్తి ఉన్నవారు సంప్రదించాలని తెలిపారు. అది చూసిన ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్..  ఉన్న ఉద్యోగంతో పాటు అదనపు ఆదాయం వస్తుంది కదా అని ఆశపడింది. ఆ నెంబర్ కి ఫోన్ చేసింది. వారు సింపుల్గా.. యూట్యూబ్లో ఉన్న వీడియోలకు లైకులు చేస్తే చాలని.. లైక్ కు కొంత మొత్తం చొప్పున డబ్బులు ఇస్తామని తెలిపారు. ఇది చాలా చిన్న విషయమే కదా అని ఆమెకు అనిపించింది. 

టెకీ భానురేఖ మృతిపై.. బెంగళూరు మహానగర పాలక సంస్థ షాకింగ్ రిపోర్టు..

అటు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూనే.. ఇది కూడా చేయొచ్చు అనుకుంది. అలా కాస్త ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని ఆశపడింది. దీంతో, వారు చెప్పిన అన్నింటికి ఒప్పుకుంది. తన బ్యాంక్ అకౌంట్ వివరాలను కూడా ఇచ్చింది.  ఇక ఆ తర్వాత ఆమె పని మొదలైంది. వారు చెప్పినట్లుగా ఓ 3 వీడియోలను లైక్ చేసింది..  దీనికి గానూ వారు రూ.150లను ఆమె అకౌంట్లో జమ చేశారు. మరో ఆరు వీడియోలు లైక్ చేయమన్నారు.. రూ. 300 అకౌంట్లో వేశారు. 

ఇలా చేయడం వల్ల.. ఆమె తమను నమ్మేలా చేశారు.  ఆ తర్వాత ప్రీపెయిడ్ టాస్కులు చేయాలని.. అలా చేస్తే ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని నమ్మించారు. అయితే, దీనికోసం పెట్టుబడి పెట్టాలని తెలిపారు. అలా చేస్తేనే లాభం వస్తుందని నమ్మబలికారు. దీనికి ఆమె సరేనంది.మొదట వెయ్యి రూపాయలు కట్టింది. దానికి ఆమెకు రూ.1600  తిరిగిచ్చారు. దీంతో పూర్తిగా వారి వలలో పడిపోయిన ఆమె విడతల వారీగా రూ.19 లక్షలు  వారి బ్యాంకు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసింది.

వారు లాభం వస్తుందని చూపిస్తున్నారు. కానీ, బ్యాంకు అకౌంట్లో నుంచి ఆ డబ్బులను డ్రా చేసుకొని అవకాశం లేకుండా పోయింది ఆమెకు. దీంతో విసుగు చెందిన ఆమె వారిని నిలదీసింది. దానికి వారు చెప్పిన సమాధానం విని షాక్ అయింది. ఆమె డబ్బులు ఆమె తిరిగి తీసుకోవాలంటే రూ.12,95,000 కట్టాలని వారు తేల్చి చెప్పారు. అలా కట్టకపోతే ఆమె ఇప్పటివరకు సంపాదించిన డబ్బు.. కట్టిన నగదు కూడా తిరిగి రాదని చెప్పేశారు మోసగాళ్లు.

ఈసారి ఆమె వారిని నమ్మలేదు. ఇప్పటికే రూ.19 లక్షలు  మోసపోయానని.. ఇంకా చెల్లించడం తన వల్ల కాదని  నిరాకరించింది. ఆ డబ్బులు ఇక తిరిగి వచ్చే అవకాశం లేదన్న విషయం అర్థం అవడంతో తాను మోసపోయానని పోలీసులను  ఆశ్రయించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios