అయ్యన్న అరెస్ట్‌లో ట్విస్ట్: టీడీపీ శ్రేణుల అడ్డగింత,వదిలేసిన పోలీసులు

 టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో  మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని  పోలీసులు  అనకాపల్లి మండలం వేంపాడు వద్దే వదిలి వెళ్లిపోయారు.

TDP Workers  Obstructed  Krishna District Police  In Anakapalle District lns

విశాఖపట్టణం: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని  అరెస్ట్ చేసిన తీసుకెళ్తున్న కృష్ణా జిల్లా పోలీసులను  టీడీపీ శ్రేణులు అనకాపల్లి జిల్లాలో అడ్డుకున్నాయి. దీంతో  పోలీసులు అయ్యన్నపాత్రుడికి  సీఆర్‌సీపీ  41 కింద నోటీసు అందించి వెళ్లిపోయారు.

గత నెల  22న  గన్నవరం యువగళం సభలో  సీఎం జగన్ , మంత్రులపై  మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కేసు నమోదైంది.ఈ కేసులో  కృష్ణా జిల్లా పోలీసులు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని విశాఖ ఎయిర్ పోర్టులో  అదుపులోకి తీసుకున్నారు.  హైద్రాబాద్ నుండి విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చిన  అయ్యన్నపాత్రుడిని ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకొని  పోలీసులు కృష్ణా జిల్లా వైపు బయలుదేరారు.

ఈ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు  అనకాపల్లి జిల్లా వేంపాడు టోల్ ప్లాజా వద్ద  అయ్యన్నపాత్రుడును తీసుకెళ్తున్న  పోలీస్ వాహనాన్ని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. టోల్ ప్లాజా సమీపంలో  ఉన్న హోటల్ వద్దకు అయ్యన్నపాత్రుడిని టీడీపీ శ్రేణులు తీసుకెళ్లాయి.ఈ సమయంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి  పోలీసులు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు.

also read:జగన్, మంత్రులపై వ్యాఖ్యలు: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్

గన్నవరంలో యువగళం సభలో  సీఎం వైఎస్ జగన్,  మంత్రులపై  మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర విమర్శలు చేశారు.ఈ విమర్శలపై  మాజీ మంత్రి పేర్నినాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా  కృష్ణా జిల్లాలోని  ఆతుకూరు  పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.ఈ కేసులోనే  మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని ఇవాళ ఉదయం  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios