నెల్లూరు జిల్లా కందుకూరులో ఫ్లెక్సీల వివాదం చోటుచేసుకుంది. మున్సిపల్ అధికారులు నగరంలో అనధికారికంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీకి చెందిన ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో టీడీపీ శ్రేణులు మున్సిపల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెల్లూరు జిల్లా కందుకూరులో ఫ్లెక్సీల వివాదం చోటుచేసుకుంది. మున్సిపల్ అధికారులు నగరంలో అనధికారికంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీకి చెందిన ఫ్లెక్సీలను తొలగించారు. వాటిని చెత్తబండీలో వేసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం ఇవ్వకుండా ఫ్లెక్సీలను ఎలా తొలగిస్తారని మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. మున్సిపల్ అధికారులు వైసీపీ కార్యకర్తలుగా వ్వవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అదే సమయంలో అనధికారికంగా ఏర్పాటు చేసిన వైసీపీ ఫ్లెక్సీలనూ తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
