ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలుగుదేశం కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు.

తాజాగా ప్రకాశం జిల్లా చినగంజాం మండలం మోటుపల్లిలో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో పద్మా అనే టీడీపీ కార్యకర్త మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు.