Asianet News TeluguAsianet News Telugu

‘‘ బెయిల్ ఎలా పొందాలి, సీబీఐ నుంచి ఎలా తప్పించుకోవాలి’’.. స్మాష్ రెడ్డి ఆధ్యర్వంలో కోర్సులు : జగన్‌పై గోరంట్ల

సీఎం జగన్‌ పాలనపై సెటైర్లు వేశారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఆదివారం వరుస ట్వీట్లు చేసిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

tdp senior leader gorantla butchaiah chowdary satires on ap cm ys jagan ksp
Author
First Published Jun 4, 2023, 4:27 PM IST | Last Updated Jun 4, 2023, 4:27 PM IST

సీఎం జగన్‌ పాలనపై సెటైర్లు వేశారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఆదివారం వరుస ట్వీట్లు చేసిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 


‘‘ హైదరాబాద్ వైపు కోచింగ్ సెంటర్స్: ~C, ~C ప్లస్, ~జావా, ~ఒరకల్, ~SQL ’’

 

ఏపీ వైపు కోచింగ్ సెంటర్స్: 

గొడ్డలి పోటు గుండె పోటు గా ఎలా చిత్రీకరించాలి, బెయిల్ ఎలా పొందాలి, సీబీఐ తో ఎలా తప్పించుకోవాలి. నిపుణులు అయిన ఫ్యాకల్టీ, స్మాష్ రెడ్డి ఆధ్వర్యంలో, మోసపు రెడ్డి సారధ్యంలో..!’’ అంటూ ట్వీట్ చేశారు.

ఆ వెంటనే మరో ట్వీట్‌లో .. ‘‘ విద్యుత్ శాఖా మంత్రి మైనింగ్ లో బిజీ .. వైద్య శాఖా మంత్రి భజనలో బిజీ, అన్నీ చూడాల్సిన ముఖ్యమంత్రి పేదలని కొట్టి, దోచుకోవటంలో బిజీ. ఇలాంటి ప్రజాప్రతినిధులు ఉంటే, రాష్ట్రం ఇలా కాక ఎలా ఉంటుంది ?. అల్లూరి జిల్లాలోని ఓ ప్రాధమిక ఆసుపత్రిలో కరెంటు లేక, సెల్ ఫోన్ వెలుగులో వైద్యం. మరో ట్విస్ట్ ఏంటి అంటే, డాక్టర్లు అందుబాటులో లేక, నర్సులుతో వైద్యం చేయించారు’’ అంటూ గోరంట్ల మండిపడ్డారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios