తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంటలో విషాదం చోటు చేసుకుంది. సర్పంచ్ అభ్యర్ధి భర్త శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గొల్లలగుంట సర్పంచ్ అభ్యర్ధిగా ఆయన భార్య పుష్పవతి నిన్న నామినేషన్ వేశారు.

అయితే శ్రీనివాస్ రెడ్డిని ఇవాళ పోలీసులు విచారించారు. కాగా, గొల్లలగుంట గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి భార్య పుష్పలతను సర్పంచ్ అభ్యర్ధిగా టీడీపీ నిర్ణయించింది. శ్రీనివాస్ రెడ్డిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.

Also Read:జగ్గంపేటలో టీడీపీ సర్పంచ్ భర్త కిడ్నాప్

కాళ్లు, చేతులు కట్టేసి శ్రీనివాస్ రెడ్డిని అటవీ ప్రాంతంలో వదిలివెళ్లారు. తనకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి కిడ్నాప్ చేశారని శ్రీనివాస్ రెడ్డి  ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవద్దని తమను ప్రత్యర్ధులు బెదిరింపులకు గురి చేశారని పుష్పలత ఆరోపించారు.

ఎన్నికల్లో పోటీ చేయకుండా బెదిరింపులకు దిగినవారే కిడ్నాప్ చేసి ఉంటారని పుష్పలత చెప్పారు. అయితే ఈ ఆరోపణలను పోలీసులు కొట్టిపారేశారు. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు.