ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి సమీపంలో ఉన్న ప్రజా వేదిక భవానాన్ని ఆయన నివాస భవనంగా వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ... ఏపీ నూతన సీఎం జగన్ ని టీడీపీ నేతలు కోరనున్నారు. ఈ మేరకు టీడీపీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రికి లేఖ రాయాలని భావిస్తున్నట్లు సమాచారం.

చంద్రబాబు ప్రస్తుతం ఒక ప్రైవేటు భవనంలో ఉంటున్నారు. ఆయన దానికి ప్రతి నెలా అద్దె చెలిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఆయనకు నివాస భవనాన్ని ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ప్రజా వేదిక భవనాన్ని ఇస్తే సౌకర్యంగా ఉంటుందని, దీనిని ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రికి లేఖ పంపాలని నిర్ణయించారు. 

గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమ నిర్మించిన పార్టీ కార్యాలయం విశాలంగా ఉన్నందున.. పార్టీ రాష్ట్ర కార్యాలయం పూర్తయ్యేవరకూ దానిని వినియోగించుకోవడంపై ఆలోచన చేయాలని నిశ్చయించారు.