Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుకు షాక్: ఓట్లు చెల్లకుండా రెబెల్స్ సూపర్ ప్లాన్

పార్టీ విప్ ను ధిక్కరించకుండా  కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీ ఓటింగ్ కి కూడా హాజరయ్యారు. వారు రాజ్యసభ ఎన్నికల్లో లెక్కింపు లో చెల్లకుండా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

TDP Rebel MLA's Cast Votes To Make Them Invalid
Author
Amaravathi, First Published Jun 19, 2020, 6:29 PM IST

వేరే రాష్ట్రాలతోపాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాజ్యసభకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు స్థానాలకు వోటింగ్ జరగగా అందులోని నాలుగు స్థానాలకు వైసీపీ అభ్యర్థులే విజయం సాధిస్తారనేది తేటతెల్లం. 

ఈ విషయం తెలిసినప్పటికీ, సంఖ్యాబలం లేకున్నప్పటికీ చంద్రబాబు నాయుడు తమ పార్టీ అభ్యర్థిగా వర్ల రామయ్యను బరిలోకి దింపారు. ఈ సందర్భంగా టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు కూడా పార్టీ విప్ ను జారీ చేసింది. 

ఈ సందర్భంగా పార్టీ విప్ ను ధిక్కరించకుండా  కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీ ఓటింగ్ కి కూడా హాజరయ్యారు. వారు రాజ్యసభ ఎన్నికల్లో లెక్కింపు లో చెల్లకుండా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

నియమావళిలో భాగంగా విప్ ఇవ్వడంతో వోటింగ్ లో పాల్గొనడంతో పాటు ఎవరికి ఓట్ వేశారో ఏజెంట్ కి చూపించడం తప్పని సరి. దీంతో టీడీపీ కే ఓట్ వేసినా అది చెల్లని విధంగా ఒకటి అని పెట్టాల్సిన మొదటి ప్రాధాన్యతా స్థానంలో టిక్ మార్క్ పెట్టారు ఈ ఎమ్మెల్యేలు. 

దీనిపై విప్ ఇచ్చిన టీడీపీ కూడా ఎం చేయలేని స్థితిలో ఉండిపోయింది. వోట్ వేశారు. పార్టీ విప్ ఆజ్ఞానుసారం నడుచుకున్నారు. కానీ వేసిన వోట్ చెల్లకుండా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. 

ఇకపోతే... నాకు విప్ ఇచ్చే మగాడా... అని చంద్రబాబుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం నాడు సాయంత్రం రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. విప్ అందిందా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా ఆయన తీవ్రంగా స్పందించారు.

విప్ ఇవ్వడానికి చంద్రబాబు దగ్గర ఏముంది, ఉడకబెట్టిన నాగడి దుంప.. అంటూ ప్రశ్నించారు.  అంత పెద్ద మగాడా అంటూ ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో తనను ప్రత్యేక సభ్యుడిగా స్పీకర్ గుర్తించినట్టుగా వంశీ చెప్పారు.

సస్పెండ్ చేసిన తనకు విప్ జారీ చేసి... పార్టీకి ఓటేయాలని కోరడాన్ని ఆయన తప్పుబట్టారు. నాకన్నా సిగ్గుండాలి... ఆయనకన్నా ఉండాలి కదా అన్నారు.నాకైతే సిగ్గుందని వంశీ స్పష్టం చేశారు.విప్ ఇవ్వడం గాడిద గుడ్డు ఇవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. 

చంద్రబాబు నాయుడు తన పక్కన ఉన్న చెంచాల మాటలను విని పార్టీని నాశనం చేశారన్నారు.  ఇదే విషయాన్ని తాము చంద్రబాబుకు చెప్పినట్టుగా ఆయన గుర్తు చేశారు.  ఏడాది కాలంగా ఏపీ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొన్నిఛానెల్స్ కు డబ్బులు ఇచ్చి వార్తలు రాయించడం ద్వారా చంద్రబాబుకు ప్రాణం పోస్తున్నారని ఆయన ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios