అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఫైర్‌ స్టేషన్‌ వద్ద టిడిపి నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆర్టీసీ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ టిడిపి నేతల నిరస నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు.బాలకృష్ణ, ఇతర నేతలు మంగళగిరి నుంచి సచివాలయం వద్ద నిరసనలో పాల్గొన్నారు.  పల్లెవెలుగు బస్సులో   వచ్చిన లోకేశ్‌, దీపక్‌రెడ్డి, అశోక్‌బాబు సచివాలయం బస్ సాప్ట్ వరకు ప్రయాణించారు.

పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ జరిగేటప్పుడు సభ అభిప్రాయం తీసుకోకుండా ఆర్టీసీ ఛార్జీలు పెంచారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇది గర్వంతో కొవ్వెక్కి తీసుకున్న నిర్ణయం తప్ప మరొకటి కాదని అన్నారు. ఎన్నికల ముందు ఏమీ పెంచేది లేదని చెప్పారు

ఇప్పుడు రోజుకో సమస్య ప్రజలపై మోపుతున్నారని ఆయన అన్నారు.పెంచిన ఆర్టీసీ ఛార్జీల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.