Asianet News TeluguAsianet News Telugu

శంషాబాద్ విమానాశ్రయంలో టీడీపీ ఎన్నారై నేత అరెస్ట్.. కారణం ఏంటంటే...

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా యష్ అరెస్టు మీద స్పందించారు. హైదరాబాద్ ఎయిర్పోర్టులోనే అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని, ఇది తెలిసి షాక్ అయ్యానని చెప్పుకొచ్చారు.

TDP NRI leader yash bodduluri arrested by ap cid at Shamshabad airport - bsb
Author
First Published Dec 23, 2023, 9:29 AM IST

హైదరాబాద్ : తల్లికి అనారోగ్యంగా ఉండడంతో చూడడానికి వచ్చిన ఓ ఎన్నారైని పోలీసులు అరెస్టు చేసిన ఘటన శంషాబాద్ ఎయిర్పోర్టులో వెలుగు చూసింది. అమెరికా నుంచి వచ్చిన యష్ బొద్దులూరి అనేఎన్ఆర్ఐని ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి నేరుగా మంగళగిరికి తరలించారు. విమానం దిగుతూనే జరిగిన ఈ ఘటనకు ఏం జరిగిందో అర్థం కాక ప్రయాణికులంతా షాక్ కు గురయ్యారు. అయితే, టిడిపి ఎన్నారై నేత అయిన యష్ మీద లుక్ అవుట్ నోటీసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. 

ఈ అరెస్టు  విషయం తెలియడంతో వెంటనే టిడిపి నేతలు స్పందించారు. తల్లికి అనారోగ్యంగా ఉండడంతో చూడడానికి వచ్చిన యష్ ని అరెస్టు చేయడం అన్యాయమని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. యష్ అక్రమ అరెస్టుని తెలుగుదేశం తీవ్రంగా ఖండించింది.  మరో వంద రోజుల్లో ఎన్నికల తర్వాత ఇలాంటి ఘటనలపై అట్టుకి..  అట్టున్నర తిరిగి ఇచ్చేస్తామన్నారు.

ముక్కోటి ఏకాదశి : ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయాలకు పోటెత్తుతున్న భక్తులు..

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా యష్ అరెస్టు మీద స్పందించారు. హైదరాబాద్ ఎయిర్పోర్టులోనే అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని, ఇది తెలిసి షాక్ అయ్యానని చెప్పుకొచ్చారు. యష్ విదేశాల నుంచి వచ్చి రాగానే ఓ టెర్రరిస్టులా అరెస్టు చేయడం దారుణమని  మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విపితే వారి గొంతు నొక్కడానికి చూస్తున్నారని.. తాము అన్యాయంగా అరెస్టు చేసిన యష్ కి న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని చెప్పుకొచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చం నాయుడు కూడా యష్ అరెస్టుపై స్పందిస్తూ.. ప్రజా సమస్యలపై స్పందించే ఎన్నారై లను వేధింపులకు గురి చేస్తున్నారని, ఇది దుర్మార్గమని అన్నారు. న్యాయమూర్తులను అసభ్య పదజాలంతో దూషించే వైసిపి నేతలకు పదవులు ఇచ్చి, ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. అరెస్ట్ అప్రజాస్వామికమని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించే ఎన్నారైలు అంటే ముఖ్యమంత్రి జగన్ కి గిట్టదు అంటూ ఎద్దేవా చేశారు.ఇది జగన్ ప్రభుత్వ సైకో చర్య అని, వైసిపికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీరును ఖండించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. అయితే, యష్ ని అదుపులోకి తీసుకునే సమయంలో ఇది అరెస్ట్ కాదని ఏపీ సీఐడీ తెలిపింది. మిమ్మల్నిఅరెస్ట్ చేయమం అని.. లుక్ అవుట్ నోటీసులు ఉండడం వల్లే తీసుకెడుతున్నాం అని తెలపడం కొసమెరుపు.

 

Follow Us:
Download App:
  • android
  • ios