సారాంశం


అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో  సీఐడీ విచారణకు  నారా లోకేష్ హాజరయ్యారు.  ఇవాళ ఉదయం 10 గంటల నుండి ఐదు గంటల వరకు  లోకేష్ ను  సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు.

అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో  సీఐడీ విచారణకు  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  మంగళవారం నాడు సీఐడీ విచారణకు హాజరయ్యారు.  ఇవాళ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు  సీఐడీ అధికారులు లోకేష్ ను విచారించనున్నారు.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ ను  ఏ 14గా  సీఐడీ అధికారులు చేర్చారు.  దీంతో ఈ కేసులో విచారణకు రావాలని గత నెల చివరలో  ఏపీ సీఐడీ అధికారులు నారా లోకేష్ కు నోటీసులు అందించారు. అయితే ఈ విషయమై  ఏపీ హైకోర్టులో  లోకేష్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ అందించిన  నోటీసులో  పేర్కొన్న కొన్ని అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.  ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు  విచారణను  ఇవాళ్టికి వాయిదా వేసింది.  లోకేష్ ను విచారించే సమయంలో  ఆయన తరపు న్యాయవాదికి కోర్టు అనుమతిని ఇచ్చింది.

ఇవాళ ఉదయమే న్యూఢిల్లీ నుండి  లోకేష్ అమరావతికి చేరుకున్నారు. ఐదు నిమిషాల ముందే  విచారణకు లోకేష్ హాజరయ్యారు. లోకేష్ విచారణ సందర్భంగా సీఐడీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ఎవరిని కూడ పోలీసులు అనుమతించడం లేదు.  ఈ ప్రాంతంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుతో తనకు ఏం సంబంధమని  లోకేష్ ప్రశ్నించారు. ఉద్దేశ్యపూర్వకంగానే తనపై ఈ కేసును నమోదు చేశారని లోకేష్ గతంలోనే ఆరోపించారు.  

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పులో తమ వారికి లబ్ది కలిగేలా  చంద్రబాబు సర్కార్ వ్యవహరించిందని  ఏపీ సీఐడీ అభియోగాలు మోపింది.  హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని రమేష్, మాజీ మంత్రి నారాయణకు చెందిన  భూములకు  లబ్ది కలిగేలా అలైన్ మెంట్ ను మార్చారని సీఐడీ ఆరోపణలు మోపింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో  హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై  గత మాసంలో  ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.  ఈ మేరకు కోర్టులో సీఐడీ అధికారులు మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే.

also read:రాజమండ్రి జైలును పేల్చేస్తామంటూ లేఖ .. చంద్రబాబుపై భద్రతపై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఈ ఏడాది సెప్టెంబర్ 9న  చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది.ఈ కేసులో చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని  చంద్రబాబు  సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఈ కేసుపై ఇవాళ కూడ వాదనలు జరగనున్నాయి. వాదనలు పూర్తైతే సుప్రీంకోర్టు ఈ పిటిషన్ పై తీర్పును వెల్లడించే అవకాశం లేకపోలేదు.