విశాఖ ఎంపీ ఓ డమ్మీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. ఢిల్లీలో జగన్ వ్యవహారాలు చూస్తున్న విజయసాయిరెడ్డి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. 

విశాఖ ఎంపీ ఓ డమ్మీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. ఢిల్లీలో జగన్ వ్యవహారాలు చూస్తున్న విజయసాయిరెడ్డి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వచ్చే నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని కేశినేని ఎద్దేవా కోరారు. అవసరమైతే ఏపీ ప్రభుత్వమే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కొనుగోలు చేయాలని నాని డిమాండ్ చేశారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. జగన్ అడుగుపెట్టగానే అమరావతి నాశనం అయ్యిందని.. విశాఖ రాజధాని అనగానే ఉక్కు మాయమైందంటూ కేశినేని నాని సెటైర్లు వేశారు. 

మరోవైపు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం నిర్ణయాన్ని పార్టీలకతీతంగా నేతలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

కార్మిక, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. నిర్ణయాన్ని కచ్చితంగా వెనక్కి తీసుకోవాలని, అప్పటి వరకు పోరాటం ఆగదని చెబుతున్నారు. 

ఈ నేపథ్యంలో ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు