టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా... ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడిన మాటలకు కేశినేని కౌంటర్లు వేశారు.

స్పందన అనే కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ.. వ్యవస్థను కడిగేయాలి.. తన వంతు ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు. అంతే కాకుండా కలెక్టర్లు, ఎస్పీలు కూడా మనసు పెడితే అవినీతి నిర్మూలన సాధ్యమేనని తెలిపారు. దీనికి సంబంధించి ఓ పత్రికలో వచ్చిన వార్తను ట్విట్టర్‌లో షేర్ చేసిన టీడీపీ ఎంపీ కేశినేని నాని, జగన్‌పై సెటైర్లు వేశారు.

‘‘వ్యవస్థను కడిగే ముందు మనని మనం కడుగుకోవాలి జగన్ గారూ! కడిగిన ముత్యాలు మాత్రమే వ్యవస్థను కడగగలవు. ఈడీ, సీబీఐ కేసులున్న మీరెలా కడగగలరు’’ అని నాని ట్వీట్‌లో పేర్కొన్నారు.