నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలవడంలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముందుంటారు. కాగా.. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ లోని అవినీతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  అవినీతిని అంతం చేయడం ఎవరి వల్లా కాదని జేసీ తేల్చి చెప్పారు.

అయితే.. రాష్ట్రంలో చెరువులు, డ్యాములకు సరిగ్గా నీళ్లు రావాలంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ టీడీపీనే అధికారంలోకి రావాలని.. చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. వచ్చే ఏడాది జనవరిలో హెచ్ఎల్సీ ద్వారా సింగనమల, గుత్తి, అనంతపురం, తాడిపత్రికి నీళ్లు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో కచ్చితంగా టీడీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.