Asianet News TeluguAsianet News Telugu

చంద్రగిరిలో రీపోలింగ్: ఈసీపై సీఎం రమేశ్ చిందులు

చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో రీపోలింగ్‌‌కు ఆదేశించడంతో ఎన్నికల సంఘంపై టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ మండిపడ్డారు

tdp mp cm ramesh fires on election commission
Author
New Delhi, First Published May 16, 2019, 8:37 PM IST

చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో రీపోలింగ్‌‌కు ఆదేశించడంతో ఎన్నికల సంఘంపై టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాకా ఎన్నికల సంఘంపై విచారణ చేసి పని పడతామని హెచ్చరించారు.

ఎటువంటి నివేదిక లేకుండా రీపోలింగ్‌కు ఎలా ఆదేశించారని రమేశ్ ఎద్దేవా చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై తాము కోర్టుకు వెళ్తామని... పార్లమెంట్‌లో సైతం విచారణ జరుపుతామన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం నిలబడి ఇది బీజేపీ ఎన్నికల సంఘమంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రీపోలింగ్‌కు ఆదేశించిన ఐదు పోలింగ్ బూత్‌లలో టీడీపీకి వన్‌సైడ్‌గా ఓట్లు పడుతుంటాయని చరిత్ర చెబుతుందని ఆయన గుర్తు చేశారు.

అయితే మీరు రీపోలింగ్‌కు భయపడుతున్నారా అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు నీకు బుద్ధి వుందా అని రమేశ్ చిందులు తొక్కారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios