ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లంచాలకు పూర్తి కాపీ రైట్స్ జగన్ వే నని ఆయన ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో జగన్.. ప్రజలకు నేను ఉన్నాను.. ప్రజల సమస్యలు వింటున్నాను అని చెబుతున్నారని.. దానికి బదులు నేను ఉన్నాను... నేను తిన్నాను... అని చెబితే బాగుంటుందని విమర్శించారు.

టీడీపీ నేతలు అనని మాటలను కూడా అన్నట్లు విపక్ష నేత చెబుతున్నారని మండిపడ్డారు. జగన్ ఇప్పటికైనా భ్రమల్లో బ్రతకడం మానుకోవాలని సూచించారు. తాము ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలను కొత్తగా అమలు చేస్తామంటున్నారని. ఇది మరీ విడ్డూరంగా ఉందన్నారు.

జగన్ అమలు చేస్తామని చెబుతున్న 2013 భూసేకరణ చట్టాన్ని తాము ఎప్పటి నుంచో అమలు చేస్తున్నామని రాజేంద్ర ప్రసాద్ వివరించారు.