నారాహమారా సభలో జగన్ కుట్ర: ఎమ్మెల్సీ

https://static.asianetnews.com/images/authors/5daec891-66fb-5683-ad67-09c295ebe8bb.jpg
First Published 1, Sep 2018, 1:20 PM IST
Tdp mlc fire on jagan
Highlights

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నారాహమారా, టీడీపీ హమారా కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలే అలజడి సృష్టించారని మండిపడ్డారు. సభలో గొడవలు సృష్టించిన వారిలో 10మంది శిల్పా బ్రదర్స్ అనుచరులేనని అందుకు తగ్గ ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు.

అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నారాహమారా, టీడీపీ హమారా కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలే అలజడి సృష్టించారని మండిపడ్డారు. సభలో గొడవలు సృష్టించిన వారిలో 10మంది శిల్పా బ్రదర్స్ అనుచరులేనని అందుకు తగ్గ ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. 

వైసీపీ కార్యకర్తలు తమ సభలకు వచ్చి గొడవలు చేస్తున్నారని అయితే వైసీపీ సభలకు తాము వెళ్లి గొడవ చేస్తో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. వైఎస్ జగన్ కుట్రను ఛేధించే శక్తి తమకుందన్నారు. వైసీపీ ప్రతిపక్ష పార్టీగా పూర్తిగా విఫలమైందని దుయ్యబుట్టారు. మరోవైపు బీజేపీ రాఫెల్ కుంభకోణంలో నిండా మునిగిపోయిందని ఘాటుగా విమర్శించారు. 
 

loader