అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. సీఎం జగన్ ఒక తుగ్లక్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ గ్రీకు వీరుడు అనుకుంటున్నారని కాదని అతను లీకు వీరుడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ట్విట్టర్ వేదికగా వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిపై నిప్పులు చెరిగారు. శకుని మామా లీకు వీరుడిని పట్టుకొని గ్రీకు వీరుడు అన్నట్టు బిల్డప్ ఇస్తున్నావు. నీకు నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నా. మీరు లీక్ చేసిన పేపర్ నాకు కూడా పంపండి. నేను, మీ తుగ్లక్ ముఖ్యమంత్రి జగన్ పరీక్ష రాస్తాం. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూసుకుందాం అంటూ సవాల్ విసిరారు. 

అంతేకాదు సవాల్ కి సిద్ధమా శకుని మామా అంటూ విజయసాయిరెడ్డిపై సెటైర్లు వేశారు బుద్దా వెంకన్న. గ్రామ సచివాలయం పరీక్ష నిజాయితీగా జరిపించాం అనే నమ్మకం ఉంటే లీకేజీ మీద విచారణ చేయించడానికి మీ తుగ్లక్ ఎందుకు భయపడుతున్నటు శకుని మామా అంటూ విజయసాయిరెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బుద్దా వెంకన్న. 

మరి బుద్దా వెంకన్న వ్యాఖ్యలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇకపోతే విజయసాయిరెడ్డిని శకుని మామా అంటూ సీఎం జగన్ ని తుగ్లక్ సీఎం అంటూ బుద్దా వెంకన్న వ్యాఖ్యానించడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.