టీడీపీకి చెందిన  ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తీవ్ర అస్వస్థతకు  గురయ్యారు.  కుటుంబ సభ్యులు ఆయనను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 

విజయవాడ: టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ  బచ్చుల అర్జునుడు ఆదివారం నాడు  తీవ్ర అవ్వస్థతకు  గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు  విజయవాడలోని  రమేష్  ఆసుపత్రికి తరలించారు.   విజయవాడలోని  రమేష్ ఆసుపత్రి వైద్యులు   బచ్చుల అర్జునుడికి  పరీక్షలు నిర్వహించారు.  పరీక్షల అనంతరం  ఆయనకు స్టంట్ వేశారు.  అర్జునుడికి గుండెపోటుతో ఇతరత్రా సమస్యలు ఏమైనా  ఉన్నాయా అనే  విషయమై  వైద్యులు   పరీక్షలు  చేస్తున్నారు.
కృష్ణా జిల్లాలో  టీడీపీ అధ్యక్షుడిగా  అర్జునుడు పనిచేశారు. గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించిన వల్లభనేని వంశీ   వైసీపీలో  చేరారు.  దీంతో గన్నవరం  అసెంబ్లీకి టీడీపీ ఇంచార్జీగా   బచ్చుల అర్జునుడు కొనసాగుతున్నారు.