గుంటూరు: ఏపీలో విద్యుత్ కోతలపై ఆసక్తికర వ్యాక్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అంధకారం నెలకొందని సెటైర్లు వేశారు. విద్యుత్ కోతలపై సీఎం వైఎస్ జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. 

పవర్ సెక్టార్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు. ఏపీ ప్రజలు విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ప్రాజెక్టులన్నీ నీటితో నిండి ఉన్న విద్యుత్ కోతలా అంటూ ప్రశ్నించారు. 

ఇప్పటికే రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయని ఆరోపించారు. ఇలాగే విద్యుత్ కోతలు ఉంటే పూర్తిగా వెళ్లిపోతాయని స్పష్టం చేశారు. విద్యుత్ కోతల ప్రభావం రాష్ట్ర ఆర్థిక రంగంపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పుకొచ్చారు. 

ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తో సీఎం జగన్ దోస్తీపైనా సెటైర్లు వేశారు ఎమ్మెల్సీ అశోక్ బాబు. కేసీఆర్‌ను అడగకుండా జగన్ ఏ పని చేయలేని పరిస్థితిలో ఉన్నారని సెటైర్లు వేశారు. కేసీఆర్‌ను అడిగి కొత్తగూడెం నుంచి బొగ్గు ఎందుకు తేలేకపోతున్నారోనంటూ పంచ్ డైలాగులు వేశారు ఎమ్మెల్సీ అశోక్ బాబు.