ఏపీ బడ్జెట్ బూటకం: వైసీపీపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల ఫైర్

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్  బూటకమని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆయన తప్పు బట్టారు. 

TDP MLA Payyavula keshav serious comments on  YCP

అమరావతి: ఏపీ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ బూటకమని TDP ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు.శుక్రవారం నాడు అమరావతిలోని టీడీఎల్పీలో ఆ పార్టీ ఎమ్మెల్యే Payyavula Keshav మీడియాతో మాట్లాడారు. 
బడ్జెట్ పై ప్రభుత్వ మాటలు, చేతలన్నీ కూడా బూటకమేనన్నారు.Budgetలో కేటాయింపులు, ప్రతిపాదనలు, ఖర్చులు కూడా బూటకమేనని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఈ విషయాన్ని తాను రుజువు చేస్తానన్నారు. మీరు చెప్పింది ఎంత, ఖర్చు పెట్టింది ఎంత అనే విషయాలు ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లోనే బయట పడుతుందన్నారు.

అప్పులు, ఆదాయం పెరిగినట్టుగా ప్రభుత్వం లెక్కలు చూపిందన్నారు. కానీ ఖర్చులు తగ్గినట్టుగా లెక్కలు చూపారన్నారు. డబ్బు ఎక్కడికి పోయిందని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. Excise శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రెట్టింపు అయిందని ఆయన చెప్పారు.  

 CAGఅనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం నివృత్తి చేయలేదన్నారు. వేల కోట్ల రూపాయాలు ఎటు వెళ్లాయో కూడా అర్ధం కావడం లేదన్నారు. రూ.48 వేల కోట్లకు సంబంధించిన రికార్డు సరిగా లేదని కాగ్ చెప్పిన విషయాన్ని పయ్యావుల కేశవ్ గుర్తు చేశారు.  తమ ప్రభుత్వం ఇరిగేషన్ పై రూ. 60 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. YCP ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసిందో చెప్పాలని కేశవ్ డిమాండ్ చేశారు.రికార్డు సరిగా లేకుంటే బ్యాంకులు ఊరుకోవని ఆర్ధిక మంత్రి Buggana Rajendranath Reddy చెబుతున్నారన్నారు.  కానీ ఆర్ధిక రికార్డులు సరిగా లేకపోతే మంత్రి ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

ఈ Assembly భజనకే పరిమితమైందని పయ్యావుల కేశవ్ విమర్శించారు. ప్రభుత్వానికి ప్రజల సమస్యలను విన్పించాలనే ఉద్దేశ్యంతో అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యేలు విజిల్ వేయాల్సి వచ్చిందని కేశవ్ చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేల భజన కార్యక్రమాన్ని ఎత్తిచూపేందుకే తాము చిడతలు వాయించినట్టుగా పయ్యావుల కేశవ్ వివరించారు.  ఒక్క అంశంపై చర్చ పెట్టే ధైర్యం  ప్రభుత్వానికి ఎందుకు లేదని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.

151 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీ సభ్యులు 15 మంది తమ సభ్యులకు ఎందుకు సమాధానం చెప్పలేకపోయారని కేశవ్ అడిగారు. చర్చ పెడితే సమాధానం చెప్పే ధైర్యం ప్రభుత్వానికి లేదా అని ఆయన అడిగారు.151 మంది ఎమ్మెల్యేల్లో వేగం తగ్గిపోయిందన్నారు.Cabinet  విస్తరణ జరుగుతుందని ఏదో ఒకరిద్దరూ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతున్నారన్నారు. ప్రజల ఆగ్రహం ఎమ్మెల్యేలు సభలో ఏమి మాట్లాడలేకపోతున్నారని కేశవ్ విమర్శించారు. 

సీఎంకు భజన చేసే కార్యక్రమంలో భాగంగా కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు టీడీపీని తిడుతున్నారని కేశవ్  చెప్పారు. ప్రజా సమస్యలపై చర్చించే ధైర్కం ఈ ప్రభుత్వానికి లేదని ఈ సమావేశాలు రుజువు చేశాయని కేశవ్ వివరించారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రజల్లో ఉన్న అసంతృప్తి శాసన సభలో కచ్చితంగా వ్యక్తం కానుందన్నారు.ఈ వాడీ వేడిని ఈ ప్రభుత్వం తట్టుకోలేదన్నారు. సారా మరణాలను సహజ మరణాలు అంటూ జగన్ ప్రభుత్వం తప్పించుకొనే ప్రయత్నం చేస్తుందన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios