వికేంద్రీకరణ అంటూనే అభివృద్ది కేంద్రీకరణ: జగన్ సర్కార్ పై గోరంట్ల సెటైర్లు
ఇవాళ మూడు రాజధానుల చట్టానికి సంబంధించి ఎదురయ్యే న్యాయ పరమైన చిక్కులను ప్లానింగ్ శాఖ సెక్రటరీ విజయ్ కుమార్ కేబినెట్ ముందుంచారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని గతంలో చేసిన పొరపాట్లు పునరావృతం చేయకుండా కొత్త బిల్లును ప్రవేశపెట్టనుంది జగన్ సర్కార్.
అమరావతి: అత్యవసరంగా పాలనా వికేంద్రీకరణ బిల్లులను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.అభివృద్ది వికేంద్రీకరణ అంశాన్ని సీఆర్డీఏ చట్టంలోనే తమ ప్రభుత్వం పొందుపర్చిన విషయాన్ని బుచ్చయ్య చౌదరి గుర్తు చేశారు. విశాఖపట్టణం, విజయనగరం సహా రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకమైన అభివృద్ది జరగాలనే విషయాన్ని తాము పొందుపర్చినట్టుగా Gorantla Butchaiah Chowdary గుర్తు చేశారు.
2019 ఫలితాలు అమరావతికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పు అని సీఎం ys jaganఅంటున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సర్కార్ తీసుకొన్న నిర్ణయాలపై కోర్టులు మొట్టికాయలు వేస్తున్నాయని బుచ్చయ్య చౌదరి గుర్తు చేశారు. visakhapatnam అన్ని హంగులు ఉన్నాయని చెబుతున్నారన్నారు. తమ ప్రభుత్వం విశాఖతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ది చేసిందని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
also read:కారణమిదీ: మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ వెనుక
అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు నిర్మించారా, భవనాలు కట్టారా అని ఆయన జగన్ ను ప్రశ్నించారు. అభివృద్ది పనులు చేయకపోగా ప్రజలపై పన్నుల భారం మోపారని ఆయన జగన్ పై మండి పడ్డారు. వికేంద్రీకరణ అంటూనే అభివృద్దిని కేంద్రీకరించేందుకు జగన్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోందని ఆయన విమర్శించారు. విశాఖపట్టణాన్ని hyderabad మాదిరిగా తీర్చి దిద్దుతానని సీఎం జగన్ ప్రకటనను ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి గుర్తు చేశారు. విశాఖలో రాజధానిని ఎందుకు కట్టలేదని ఆయన ప్రశ్నించారు. విశాఖపట్టణం అభివృద్దికి తాము వ్యతిరేకం కాదన్నారు.
మీరు కూర్చుంటున్న assembly భవనాన్ని ఎవరు నిర్మించారని బుచ్చయ్య ycp ని ప్రశ్నించారు. హైకోర్టు నూతన భవనం, సీఆర్డీడీఏ రోడ్లను జగన్ సర్కార్ నిలిపివేసిందన్నారు. ప్రాంతాల మధ్య, కులాలు, మతాల మధ్య విబేధాలు రెచ్చగొట్టేందుకు జగన్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోందన్నారు. నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి మూడు రాజధానుల చట్టం తీసుకొచ్చామని చెప్పిన వైసీపీ నేతలు ఇవాళ ఈ చట్టాన్ని రద్దు చేసుకొన్నారంటే నిపుణుల కమిటీ సత్తా ఎమిటో తేలిందన్నారు. రాజధాని విషయంలో తమ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలపై నానా రకాలుగా జగన్ సర్కార్ ప్రచారం చేసిందన్నారు.
కొంత కాలం పాటు ముంపు ప్రాంతంగా ప్రచారం చేశారన్నారు. మరికొన్ని రోజులు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు. ఈ విషయాలపై ప్రజలకు వాస్తవాలు తెలిశాయని గోరంట్ల బుచ్చయ్య చౌదరి గుర్తు చేశారు. అయితే కోర్టు ముందు తమ చట్టం తేలిపోతుందనే ఉద్దేశ్యంతో జగన్ సర్కార్ ఇవాళ మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకంందని బుచ్చయ్య చౌదరి విమర్శించారు. రాజకీయ కక్ష సాధింపు కార్యక్రమంలో భాగంగానే జగన్ సర్కార్ ఇలాంటి నిర్ణయాలు తీసుకొంటుందని చెప్పారు.
రాజకీయ కక్ష సాధింపు కార్యక్రమంలో భాగంగానే జగన్ సర్కార్ ఇలాంటి నిర్ణయాలు తీసుకొంటుందని చెప్పారు. జగన్ సర్కార్ తీసుకొన్న నిర్ణయాల్లో మెజార్టీ వాటిని కోర్టు మొట్టికాయలు వేసిందని ఆయన గుర్తు చేశారు. మూడు రాజధానుల విషయంలో కూడా కోర్టు నుండి మొట్టికాయలు తినాల్సి వస్తుందనే కారణంగా వెనక్కి తీసుకొన్నారని ఆయన చెప్పారు.