అమరావతి: చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ భవనం అక్రమంగా నిర్మించిందని తేలితే ఖాళీ చేస్తామని  టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు.

బుధవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు.  చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలకు జగన్  పాల్పడుతున్నాడని  ఆయన ఆరోపించారు. మిగిలిన భవనాలను వదిలేసి ప్రజా వేదికనే ఎందుకు కూల్చివేశారని ఆయన ప్రశ్నించారు. 

వైఎస్ జగన్ సర్కార్  చేసే అన్ని పనులను ప్రజలు గమనిస్తున్నారని ఆయన చెప్పారు. నిబంధనలకు విరుద్దంగా ప్రజా వేదిక భవనాన్ని నిర్మించారని  ఏపీ సీఎం జగన్ కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు. 

ఇదే సమావేశంలోనే ఈ భవనాన్ని కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా  మంగళవారం రాత్రి నుండి  ప్రజా వేదిక కూల్చివేత పనులు సాగుతున్నాయి.