Asianet News TeluguAsianet News Telugu

కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతించిన బాలకృష్ణ: హిందూపురం కేంద్రంగా పుట్టపర్తి జిల్లాకై డిమాండ్

కొత్త జిల్లాల ఏర్పాటును హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్వాగతించారు. అయితే హిందూపురం కేంద్రంగా పుట్టపర్తి జిల్లాను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
 

TDP MLA Balakrishna welcomes New Districts
Author
Guntur, First Published Jan 27, 2022, 4:12 PM IST

అమరావతి: కొత్త Districts ఏర్పాటును స్వాగతిస్తున్నట్టుగా Hindpur  ఎమ్మెల్యే Balakrishna ప్రకటించారు.పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క జిల్లా చేయడం సరైందేనని ఆయన చెప్పారు.హిందూపురం కేంద్రంగా Puttaparthiని జిల్లా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.జిల్లా ఏర్పాటులో రాజకీయాలు వద్దని ఆయన కోరారుహిందూపురం ప్రజల మనోభావాలను గౌరవించాలని  ఆయన  ప్రభుత్వాన్ని కోరారు.  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 26న జారీ చసిన నోటిఫికేషన్ పై ప్రజలకు నెల రోజుల సమయం ఇచ్చింది. నెల రోజుల్లో సలహాలు, సూచనలు, అభిప్రాయాలను తెలపాలని ప్రభుత్వం కోరింది.

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రి మండలి మంగళవారం నాడు ఆమోదం  తెలిపింది. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం Notification  విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ పై ప్రజలు తమ సూచనలు,సలహాలతో పాటు అభిప్రాయాలను తెలపాలని ప్రభుత్వం కోరింది. వచ్చే నెల 26వ తేదీ వరకు ప్రజలకు గడువును ఇచ్చింది. ఉగాది నుండి కొత్త జిల్లాల నుండి పాలన సాగించాలని జగన్ సర్కార్ తలపెట్టింది. ఇదే విషయాన్ని రిపబ్లిక్ డే ఉత్సవాల్లో కూడా గవర్నర్ ప్రస్తావించారు.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు YS Jagan హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలున్నాయి. అయితే రాష్ట్రంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు.. అరకు ఎంపీ స్థానాన్ని రెండు జిల్లాలుగా విభజించారు. అరకు పార్లమెంట్ స్థానం నాలుగు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. దీంతో  ఈ ఎంపీ స్థానాన్ని రెండు జిల్లాలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు గతంలోనే జీవోను జారీ చేసింది.

కొత్త జిల్లాల ఏర్పాటుపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి Nilam Sawhney నేతృత్వంలో 2020 ఆగష్టు 9వ తేదీన అధ్యయన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. New జిల్లాల ఏర్పాటు విషయంలో సరిహద్దులు, సాంకేతిక అంశాలను కూడ  ఈ కమిటి అధ్యయనం చేసింది.2021 మార్చి 31వ తేదీ నాటికి కొత్త జిల్లాలను ఏర్పాటును పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.అయితే అనేక కారణాలతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది.

కొత్త జిల్లాల ప్రక్రియను వేగవంతం చేయడానికి మంగళవారం నాడు ఆన్ లైన్ మంత్రిమండలి సమావేశంలో కొత్త జిల్లాలకు జగన్ సర్కార్ పచ్చ జెడా ఊపింది. మరునాడే నోటిఫికేషన్ ను కూడా జారీ చేసింది. కొత్త జిల్లాలపై ప్రజల నుండి  వచ్చే సూచనలు, సలహాలు, ఫిర్యాదులపై నెల రోజుల తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే కొన్ని జిల్లాల ఏర్పాటు విషయమై ప్రజలు ఆందోళన బాట పట్టారు.

ఈ నెల రోజుల నుండి ప్రజల నుండి వచ్చిన సలహాలు, సూచనలతో పాటు ఇతర అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని మార్పులు చేర్పులు చేయనుంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలాంటి మార్పులు చేర్పులు జరగకుండా కూడా అధికారులు జాగ్రత్త తీసుకొన్నారు.
 


 

Follow Us:
Download App:
  • android
  • ios