కాకినాడలో పర్యటనకు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయిని బీజేపీ నేతలు అడ్డుకున్న సంగతి తెలిసిందే

కాకినాడలో పర్యటనకు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయిని బీజేపీ నేతలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీనిని నిరసిస్తూ.. టీడీపీ నేతలు శనివారం గుంటూరులో ఆందోళన చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీ నారాయణ ఇంటి ఎదుట టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

విజయవాడ టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ప్రధాని నరేంద్రమోదీ కి, కన్నా లక్ష్మీ నారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా.. రంగంలోకి వెంటనే బీజేపీ కార్యకర్తలు కూడా పోటీపోటాగా ఆందోళన చేపట్టారు. మోదీ, కన్నాకి మద్దతుగా నినాదాలు చేశారు. ఇరు పార్టీల నేతల ఆందోళతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.