రఘురామ విషయంలో వైసీపీ నేతలు ఫ్యాక్షనిస్టుల్లా వ్యవహరిస్తున్నారు.. టీడీపీ
తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన ముఖ్య నేతల సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడుతోపాటు అందుబాటులో ఉన్న ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో అనేక అంశాలపైన చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన ముఖ్య నేతల సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడుతోపాటు అందుబాటులో ఉన్న ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో అనేక అంశాలపైన చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
జగన్‌రెడ్డి ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు గాలికొదిలేసి తమ అప్రజాస్వామిక చర్యల్ని, ప్రజా వ్యతిరేక చర్యల్ని, తమ దోపిడీని ప్రశ్నించిన నేతలపై కక్షసాధింపు చర్యల్లో సీఎం తలమునకలు కావడం వల్లనే కరోనా తీవ్రతలో ఏపీ దేశంలో 2వ స్థానంలో వున్నదని సమావేశం అభిప్రాయ పడింది.
సీఐడి పోలీస్, జుడీషియల్ కస్టడీలో వున్న రఘురామకృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం కోర్టు ధిక్కరణగా పార్టీ భావించింది. అలాగే వైసీపీ నేత భార్య ఆధ్వర్యంలో మెడకల్ రిపోర్టు తయారు చేయించారు. నిబంధనలకు విరుద్ధంగా సీఐడి అధికారి హాస్పిటల్‌కు వెళ్లి రిపోర్టు తారుమారు చేయించారు.
దాన్ని కప్పి పెట్టుకోవడానికే కోర్టు ఆదేశాల్ని ధిక్కరించి రమేష్ హాస్పిటల్‌కు తీసుకెళ్ళకుండా దొడ్డిదారిన జైలుకు తీసుకెళ్లారు. రఘురామకృష్ణంరాజు గారిని హత్య చేసే ప్రమాదముందన్న వారి శ్రీమతి ఆందోళనలో ఉన్న సహేతకతను పార్టీ గుర్తించింది.
చట్టాల్ని, రాజ్యాంగాన్ని, మానవ హక్కుల్ని ఉ్లంఘించిన అధికారులపైన, నేతలపైన న్యాయపోరాటం చేయాలని పార్టీ నిర్ణయించింది. మెడికల్ రిపోర్టులో అధికారుల సంతకాలు లేకుండా వైసీపీ సోషల్ మీడియాలో వచ్చాయంటే ఆ రిపోర్టు వైసీపీ కార్యాయంలో తయారైందేమోనని సందేహం కలుగుతున్నది.
కోవిడ్ బాధితులకు అనేక రాష్ట్రాలు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి ఆదుకొంటున్నాయి. కేరళలో 16 నిత్య జీవితావసరాలు సరఫరాతోపాటు రూ.6 వేల నగదు ఇస్తున్నది. కనుక జగన్‌రెడ్డి ప్రభుత్వం కరోనా బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని పార్టీ డిమాండ్ చేస్తున్నది.
చంద్రబాబు ప్రభుత్వ కాలానికన్నా జగన్‌రెడ్డి ప్రభుత్వానికి కేంద్రం నుండి గానీ, తెచ్చిన అప్పు వల్ల గానీ, పెంచిన పన్ను వల్ల గానీ రాబడులు అధికంగానే వున్నా రైతుల పంటల్ని ఎందుకు కొనుగోలు చేయడం లేదని పార్టీ ప్రశ్నించింది. దుబారాను, దోపిడీని ప్రక్కన పెట్టి కరోనా బాధితులకు వెంటనే ప్యాకేజీ ఇవ్వాలి.
కోవిడ్‌కు జగన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర నిధుల నుండి ఖర్చు చేసింది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువగానే ఉన్నది. కనుక కోవిడ్‌కు రాష్ట్ర నిధుల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలి.
ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థులుంటారేగానీ శత్రువులు వుండరు. అందుచేత వివిధ పార్టీల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం దేశంలోను, అన్ని రాష్ట్రాలలోను వున్నది. కేరళ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతతో కలిసి వరద పర్యటనలు చేశారు. ఫ్యాక్షనిస్టు మాత్రమే ఆ ఇంటిపై కాకి ఈ ఇంటిపై వాలకూడదని భావిస్తారు. రఘురామకృష్ణంరాజు విషయంలో వైసీపీ నేతల ప్రకటనలు ఫ్యాక్షన్ తత్వాన్నే ప్రతిబింబిస్తున్నవి గానీ ప్రజాస్వామ్యబద్ధంగా లేవు.
జగన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా వుండగానే డీయస్పీ ప్రమోషన్ల విషయంలో అబద్ధాలతో కుతత్వం రెచ్చగొట్టాడు. చంద్రబాబును కాల్చాలని, బంగాళాఖాతంలో కలపాలని, చెప్పుతో కొట్టాలని తీవ్రంగా మాట్లాడారు. మతతత్వాల్ని రెచ్చగొట్టారు.
అధికారం వచ్చి సీఎం అయిన తరువాత రాజధానికి కులం అంటగట్టారు. కొన్ని సామాజిక వర్గాలపై టార్గెటెడ్‌గా దాడులు చేశారు, హత్యలు చేశారు. చివరకు వేలమందికి ఉద్యోగాలు కల్పించిన పరిశ్రమలపై దాడులు చేశారు. ప్రాణాల్ని కాపాడే కోవాగ్జిన్‌కు కూడా కులాలు అంటగట్టారు. నిత్యం ప్రతిపక్ష నేతను సాక్షి గాని, మంత్రులుగాని తీవ్ర పదజాలంతో దూషించని రోజు లేదు. జగన్‌రెడ్డి పార్టీ బ్రతుకుతున్నదే కుల, మత, ప్రాంతీయ హెట్ర్‌డ్ మీద - తమ దుర్మార్గాన్ని ప్రతిపక్షాలపైకి, గిట్టని వారి తలకు చుట్టే కుట్రల్ని సమావేశం ఖండించింది.
కరోనాతోపాటు, బ్లాక్ ఫంగస్ నివారణకు సీయం చర్యలు లోపభూయిష్టంగా ఉన్నాయి. వ్యాక్సిన్, ఆక్సిజన్, మందుల కొరత, బ్లాక్‌మార్కెట్, అవినీతి నిరోధక చర్యల్లో వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్ళించడానికే అక్రమ అరెస్టులు, హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని పార్టీ నిర్థారణకు వచ్చింది. అక్రమ కేసుల్ని, హింసాత్మక చర్యల్ని, వైసీపీ దుష్ప్రచారాల్ని ఖండించాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలకు పార్టీ విజ్ఞప్తి చేస్తున్నదని నిర్ణయించారు.