Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో ప్రభుత్వ ఆస్తులు తాకట్టు... ముమ్మాటికి తుగ్లక్ నిర్ణయమే: అయ్యన్న ఫైర్ (వీడియో)

విశాఖలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి జగన్ సర్కార్ అప్పులు తీసుకోవడం దారుణమని తెలుగుదేశం పార్టీ నాయకులు అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. 

tdp leaders ayyannapatrudu serious  mortgage of government assets in vizag
Author
Vizag, First Published Oct 4, 2021, 1:09 PM IST

విశాఖపట్నం: వైసిపి ప్రభుత్వం (ysrcp government) విశాఖలోని (visakhapatnam) విలువైన ఆస్తులను తాకట్టు పెట్టడం బాధాకరమని మజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (ayyannapatrudu) అన్నారు. అసలు ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టడానికి వీళ్లకున్న అధికారం ఏంటి...? అని ప్రశ్నించారు. జగన్ సర్కారుది ముమ్మాటికీ తుగ్లక్ నిర్ణయమేనని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న అన్ని పార్టీల నాయకులు ఈ తుగ్లక్ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని అయ్యన్న కోరారు. 

''ఇప్పటికే ఏ2 విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో విలువైన ఆస్తులను దోచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ ఐటిఐ కాలేజి, పాలిటెక్నిక్ కాలేజి, సర్య్కూట్ హౌస్, తహసీల్దార్ కార్యాలయం, గోపాలపట్నం రైతు బజార్, పోలీసు క్వాటర్స్ ఇలా 13 విలువైన ప్రజల ఆస్తులను రూ.25 వేల కోట్లకు తాకట్టు పెట్టారు. ఈ నిర్ణయం తప్పని ఇప్పటికే విశాఖ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసు కోర్టులో పెండింగ్ ఉండగానే ఈ మూర్ఖులు తాకట్టు పెట్టేసారు'' అని మండిపడ్డారు. 

వీడియో

''ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు చెందిన అన్ని పార్టీల నాయకులు గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి... ఇది మంచి నిర్ణయమా...? కొంత మంది దొంగలు ఎక్కడెక్కడ నుండో వచ్చి మన ప్రాతంలో దోపిడీ చేస్తుంటే మనం చోద్యం చూస్తున్నాం. వాళ్ళు మరో 2 సంవత్సరాల తరువాత పోతారు... కానీ నష్టపోయేది మన ప్రాంత ప్రజలు. కావున పార్టీలకు అతీతంగా మన ప్రాంత ఆస్తులను కాపాడుకోవలసిందిగా కోరుచున్నాను'' అని అయ్యన్న పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios