ప్రేమ పెళ్లి... నవ వరుడిని చితకబాదిన టీడీపీ నేతలు

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 25, Aug 2018, 10:13 AM IST
tdp leaders attack on bride groom in krishna district
Highlights

దీంతో ఈ నెల 19వ తేదీ ఊరి నుంచి వెళ్లి  మొగల్తూరులోని ఓ చర్చిలో 20వ తేదీన క్రిస్టియన్ పద్దతిలో వివాహం చేసుకున్నారు.
 

పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు.. నవ వరుడిని టీడీపీ నేతలు అతి దారుణంగా చితకబాదారు. పూర్తి వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా బందరు మండలం చిన్నాపురానికి చెందిన వడ్డి హరిసాయి ఆక్వా ఫుడ్‌ కంపెనీలో ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటాడు.

 ఏలూరు సీఆర్‌ రెడ్డి కళాశాలలో డిగ్రీ ఫైనలియర్‌ చదువుతున్న అదే గ్రామానికి చెందిన ఓ మండల స్థాయి టీడీపీ నేత తమ్ముడు కాగిత నారాయణ కూతురు కాగిత శోభనతో అతనికి మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త  ప్రేమగా మారింది. ఇటీవల వారిరువురూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలకు విషయం చెప్పారు. శోభన తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఈ నెల 19వ తేదీ ఊరి నుంచి వెళ్లి  మొగల్తూరులోని ఓ చర్చిలో 20వ తేదీన క్రిస్టియన్ పద్దతిలో వివాహం చేసుకున్నారు.

విషయం తెలుసుకున్న వధువు తరపున టీడీపీ  నేతలు.. నవ వరుడిని చితక బాదారు. పెళ్లికూతురును బలవంతంగా లాక్కొని వెళ్లిపోయారు. ఇదంతా పోలీసుల సమక్షంలో జరుగుతున్నప్పటికీ.. వారేమీ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. 

loader