విజయవాడ భవానీపురంలో సంచలనం సృష్టించిన బాలిక ఆత్మహత్య కేసులో టీడీపీ నేత వినోద్ కుమార్ జైన్‌కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.
విజయవాడ భవానీపురంలో సంచలనం సృష్టించిన బాలిక ఆత్మహత్య కేసులో టీడీపీ నేత వినోద్ కుమార్ జైన్‌కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. అలాగే రూ.3 లక్షల జరిమానా విధిస్తూ పోక్సో కోర్ట్ తుది తీర్పు వెలువరించింది. సెక్షన్ 305 కింద జీవితకాల జైలు శిక్ష విధించింది. పోక్సో యాక్ట్ 9, 10 సెక్షన్ల కింద ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది . గతేడాది భవానీపురంలో టీడీపీ నేత లైంగిక వేధింపులు తాళలేక అపార్ట్‌మెంట్ నుంచి దూకి బాలిక ఆత్మహత్య చేసుకుంది. స్థానిక లోటస్ లెజెండ్ అపార్ట్‌మెంట్‌లో బాలికను వినోద్ జైన్ వేధింపులకు గురిచేసినట్లుగా దర్యాప్తులో తేలింది. అతని వేధింపులను ఎవరికి చెప్పుకోలేక బాలిక బలవన్మరణానికి పాల్పడింది. అంతేకాకుండా సూసైడ్ నోట్‌లో వినోద్ దారుణాలపై ప్రస్తావించింది. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.
Add Asianetnews Telugu as a Preferred Source

