ఫాదర్స్ డే సందర్భంగా సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడలు తదితర రంగాలకు చెందిన ప్రముఖులు తమ తండ్రులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఆ సంగతులను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ తన తండ్రి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

నాన్న పని ముగించుకుని ఇంటికి రావడం, ఉదయాన్నే తిరిగి పనికి వెళ్లడమే ఎక్కువగా చూశాను. మధ్యలో నాతో గడిపిన కొద్దిపాటి సమయంలో ఎంతో ప్రేమ చూపేవారు. నాకున్న బెస్ట్ ఫ్రెండ్, గురువు మా నాన్నే అయినందుకు ఆయనకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశారు.